కాషాయం గూటికి కోట్ల ఫ్యామిలీ?
రాయలసీమలో పట్టు కోసం బీజేపీ తహతహలాడుతోంది. ఈ ప్రాంతంలో టీడీపీ ఇక పుంజుకునే పరిస్థితి లేదు. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో కేవలం మూడే మూడు సీట్లు టీడీపీ గెలిచింది. అందులో ఒకటి కుప్పం. రెండోది హిందూపురం. మూడోది ఉరవకొండ. చిత్తూరులో ఒకటి,అనంతపురంలో రెండు సీట్లు మాత్రమే గెలిచింది. కడప,కర్నూలులో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. సీమ జిల్లాల్లో టీడీపీ ఇక లేచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కీలకమైన నేతలు పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారని […]
రాయలసీమలో పట్టు కోసం బీజేపీ తహతహలాడుతోంది. ఈ ప్రాంతంలో టీడీపీ ఇక పుంజుకునే పరిస్థితి లేదు. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో కేవలం మూడే మూడు సీట్లు టీడీపీ గెలిచింది. అందులో ఒకటి కుప్పం. రెండోది హిందూపురం. మూడోది ఉరవకొండ. చిత్తూరులో ఒకటి,అనంతపురంలో రెండు సీట్లు మాత్రమే గెలిచింది. కడప,కర్నూలులో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
సీమ జిల్లాల్లో టీడీపీ ఇక లేచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కీలకమైన నేతలు పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో కీలకమైన కోట్ల ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని జిల్లాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు ఒక దఫా చర్చలు పూర్తి చేశారని అంటున్నారు.
ఇటు బీజేపీ నేతలు కూడా పదేపదే ఈ విషయంలో ప్రకటనలు చేస్తున్నారు. 12 నుంచి 14 మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని లీకులు ఇస్తున్నారు. రెండు,మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు, నాయకులు త్వరలో బీజేపీలో చేరనున్నారని చెబుతున్నారు.
కర్నూలులో కీలకమైన నేతలతో బీజేపీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మరోవైపు అనంతపురంలో కూడా జేసీ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీతో చర్చలు నడిచినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూరిని ముందు బీజేపీలోకి పంపినట్లు చెబుతున్నారు. సూరి జంప్‌తో జిల్లాలో వచ్చే రియాక్షన్ బట్టి ఇతర నేతల చేరికలు ఉంటాయని సమాచారం. మొత్తానికి సీమలో పాగా కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.