Telugu Global
NEWS

కేసీఆర్‌, జగన్‌ భేటీపై టీడీపీ పెద్ద పత్రిక విన్యాసం

టీడీపీ పెద్ద పత్రిక మరోసారి విన్యాసం చేసింది. గోదావరి నీటిని కృష్ణకు తరలించి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు ముఖ్యమంత్రులు చారిత్రక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గురించి మీడియా దాదాపు సానుకూలంగానే స్పందించింది. టీడీపీ అనుకూల పత్రికలు కూడా సానుకూల కోణంలోనే కథనాలు రాశాయి. అయితే టీడీపీ పెద్ద పత్రిక కథనాన్ని ప్రచురించిన విధానమే ఇప్పుడు ఆసక్తిగా ఉంది. గోదావరి నుంచి రోజుకు నాలుగు టీఎంసీల మేర నీరు తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు […]

కేసీఆర్‌, జగన్‌ భేటీపై టీడీపీ పెద్ద పత్రిక విన్యాసం
X

టీడీపీ పెద్ద పత్రిక మరోసారి విన్యాసం చేసింది. గోదావరి నీటిని కృష్ణకు తరలించి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు ముఖ్యమంత్రులు చారిత్రక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గురించి మీడియా దాదాపు సానుకూలంగానే స్పందించింది. టీడీపీ అనుకూల పత్రికలు కూడా సానుకూల కోణంలోనే కథనాలు రాశాయి. అయితే టీడీపీ పెద్ద పత్రిక కథనాన్ని ప్రచురించిన విధానమే ఇప్పుడు ఆసక్తిగా ఉంది.

గోదావరి నుంచి రోజుకు నాలుగు టీఎంసీల మేర నీరు తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. అయితే పెద్ద పత్రిక మాత్రం ఏపీ ఎడిషన్లో ”రోజుకు నాలుగు టీఎంసీలు” అని చెప్పకుండా ”నాలుగు టీఎంసీల నీటిని” తరలించేందుకు నిర్ణయించారు అని రాసింది.

మొదటి పేజీలో రెండుమూడు చోట్ల ఇలాగే రాసింది. చర్చల గురించి పూర్తి వివరాలు తెలియని వారు చూస్తే…. నాలుగు టీఎంసీల నీరు తరలించేందుకు ఇంత బిల్డప్పా అన్న భావన కలగడం ఖాయం. కానీ తరలించేది ఏడాది మొత్తం కలిసి నాలుగు టీఎంసీలు కాదు… రోజుకు నాలుగు టీఎంసీలు. కానీ ”రోజుకు” అన్న మాట వాడకుండా పెద్ద పత్రిక జాగ్రత్తపడింది.

అనంతపురంలో పెద్ద పత్రికను చదివిన వారికి మరి తెలంగాణ ఎడిషన్‌లో కూడా ఇలాగే అచ్చేశారా? అన్న అనుమానం వచ్చి… ఆన్ లైన్ లో ఈ -పేపర్‌ను పరిశీలించారు. ఈ- పేపర్‌లో మాత్రం జాగ్రత్తగానే కథనం రాశారు. ఏపీ, తెలంగాణ ఈ- ఎడిషన్‌లో మాత్రం ప్రతి చోటా రోజుకు నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తారు అని రాసింది.

మరి ఏపీ సాధారణ ఎడిషన్‌కు వచ్చే సరికి రోజుకు నాలుగు టీఎంసీల తరలింపు అని కాకుండా… ఏడాది మొత్తానికి కేవలం నాలుగు టీఎంసీలు మాత్రమే తరలిస్తారు కాబోలు అన్న భావన కలిగేలా కథనాన్ని అచ్చేశారు. ఈ మాయ ఏమరపాటు వల్ల వచ్చిందో… లేకుంటే రోజుకు నాలుగు టీఎంసీల తరలింపు అన్న మాటే రుచించలేదో!.

First Published:  29 Jun 2019 6:01 AM IST
Next Story