Telugu Global
NEWS

కోపా అమెరికాకప్ సెమీస్ లో బ్రెజిల్

పెనాల్టీ షూటౌట్లో పరాగ్వేపై గెలుపు లాటిన్ అమెరికా సాకర్ సంబరం కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ సెమీఫైనల్స్ కు ఆతిథ్య బ్రెజిల్ చేరుకొంది. పోర్టో అలెగ్రీ వేదికగా పరాగ్వేతో ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్స్ లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతగా నిలిచింది. ఆట నిర్ణితసమయం 90 నిముషాలలో ఏ జట్టు గోలు చేయలేకపోవడంతో..అదనపు సమయానికి పొడిగించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు.  పరాగ్వే తొలి పెనాల్టీని బ్రెజిల్ గోల్ కీపర్ […]

కోపా అమెరికాకప్ సెమీస్ లో బ్రెజిల్
X
  • పెనాల్టీ షూటౌట్లో పరాగ్వేపై గెలుపు

లాటిన్ అమెరికా సాకర్ సంబరం కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ సెమీఫైనల్స్ కు ఆతిథ్య బ్రెజిల్ చేరుకొంది. పోర్టో అలెగ్రీ వేదికగా పరాగ్వేతో ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్స్ లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతగా నిలిచింది.

ఆట నిర్ణితసమయం 90 నిముషాలలో ఏ జట్టు గోలు చేయలేకపోవడంతో..అదనపు సమయానికి పొడిగించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు.

పరాగ్వే తొలి పెనాల్టీని బ్రెజిల్ గోల్ కీపర్ అడ్డుకొని తన జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు. చివరకు బ్రెజిల్ 4-3 గోల్స్ తో మ్యాచ్ నెగ్గి.. ప్రస్తుత టోర్నీ సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.

గతంలో 2011, 2015 కోపా అమెరికాకప్ టోర్నీల క్వార్టర్ ఫైనల్స్ లో పరాగ్వే చేతిలో పెనాల్టీ షూటౌట్ పరాజయాలు పొందిన బ్రెజిల్… ప్రస్తుత టోర్నీలో మాత్రం విజేతగా నిలవడం ద్వారా ఊపిరిపీల్చుకొంది.

అర్జెంటీనా- వెనిజ్వేలా జట్ల క్వార్టర్ ఫైనల్లో నెగ్గిన జట్టుతో బ్రెజిల్ తలపడాల్సి ఉంది. తొలి సెమీఫైనల్ ను బెలో హారిజాంటో వేదికగా నిర్వహిస్తారు.

First Published:  29 Jun 2019 1:31 AM IST
Next Story