ఆంధ్రజ్యోతి భవనానికి నోటీసులు
ఏపీలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మాణాలపై శరవేగంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపైనా దృష్టి సారించింది. అక్రమ కట్టడాల జాబితాలో ఆంధ్రజ్యోతి పత్రిక భవనం కూడా చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం రెండు అంతస్తుల్లో ప్రింటింగ్ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(గుడా) అధికారులు […]
ఏపీలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మాణాలపై శరవేగంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపైనా దృష్టి సారించింది.
అక్రమ కట్టడాల జాబితాలో ఆంధ్రజ్యోతి పత్రిక భవనం కూడా చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం రెండు అంతస్తుల్లో ప్రింటింగ్ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరా 75 సెంట్లలో ప్రింటింగ్ ప్రెస్ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం నిర్మించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. దీని నిర్మాణం కోసం అధికారుల నుంచి గానీ, ‘గుడా’ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదు.
అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిన నేపథ్యంలో తమ భవనానికి అన్ని అనుమతులు తక్షణం ఇవ్వాల్సిందిగా అధికారులపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని చెబుతున్నారు.
క్రమబద్దీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే 70 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం ససేమిరా అంటోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో అధికారులు హెచ్చరించారు.