Telugu Global
NEWS

ఆ 18 మంది కోసం బీజేపీ వేట !

ఏపీలో బీజేపీ ఏం చేయ‌బోతుంది? రాబోయే రోజుల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఎలా ప‌దును పెట్ట‌బోతుంది? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరారు. ఓ అధికార ప్ర‌తినిధి, మ‌రో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి కూడా పార్టీ మారారు. అయితే బీజేపీ ల‌క్ష్య‌మేంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ తాము వాయిస్ వినిపిస్తామ‌ని […]

ఆ 18 మంది కోసం బీజేపీ వేట !
X

ఏపీలో బీజేపీ ఏం చేయ‌బోతుంది? రాబోయే రోజుల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఎలా ప‌దును పెట్ట‌బోతుంది? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరారు. ఓ అధికార ప్ర‌తినిధి, మ‌రో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి కూడా పార్టీ మారారు. అయితే బీజేపీ ల‌క్ష్య‌మేంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీ అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ తాము వాయిస్ వినిపిస్తామ‌ని గ‌త కొన్ని రోజులుగా బీజేపీ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. టీడీపీ త‌ర‌పున 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. వీరిలో 15 నుంచి 18 మందిని లాగేస్తే టీడీపీ ఎల్పీ ఉండ‌దు. వీరిని ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించాలి. వీరంతా బీజేపీ త‌ర‌పున ప‌నిచేస్తారు, ఇదే స్కెచ్‌ను రాబోయే రోజుల్లో బీజేపీ అమ‌లు చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య ప్రసాద్ ఓసారి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ నేత‌ల‌ను క‌లిశారు. అయితే ఇప్పుడే వ‌ద్దు…. 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు అంద‌రూ వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలని బీజేపీ పెద్ద‌లు చెప్పార‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా మ‌రో నెల‌లో మిగతా ఎమ్మెల్యేల‌కు బీజేపీ నేత‌లు వ‌ల వేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే సుజ‌నా చౌద‌రితో పాటు ఇత‌ర నేత‌లు ఎమ్మెల్యేల‌తో మాట్లాడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌సారి ఎమ్మెల్యేల నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చిన త‌ర్వాత మంచి రోజు చూసుకొని నేతలందరూ బీజేపీలో చేర‌తార‌ని స‌మాచారం.

ఎమ్మెల్యేల‌తో మంత‌నాలకు మ‌రో నెల రోజుల స‌మ‌యం ప‌ట్టేట్లు ఉంది. ఇప్ప‌టికే దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మిగ‌తా వారిని క‌న్విన్స్ చేసేందుకు రాయ‌బారాలు న‌డుస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఇదంతా తెలిసే…. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు త‌న అనుకూల మీడియాలో రోజుకో వ్య‌వ‌హారం చంద్ర‌బాబు న‌డిపిస్తున్నార‌ని అంటున్నారు.

First Published:  29 Jun 2019 1:30 AM IST
Next Story