Telugu Global
NEWS

డిప్యూటీ సీఎం ఆఫీస్‌ దారి తప్పడంపై జగన్ సీరియస్

టీడీపీ హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు, ఇతర సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్రాక్‌ రికార్డు కారణంగానే టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వ్యక్తులను, పీఏలను, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నియమించుకోవద్దని తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు మంత్రుల వద్దకు చేరేందుకు…. గతంలో టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గత మంత్రుల వద్ద పనిచేసిన అనుభవంతో తాము […]

డిప్యూటీ సీఎం ఆఫీస్‌ దారి తప్పడంపై జగన్ సీరియస్
X

టీడీపీ హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు, ఇతర సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్రాక్‌ రికార్డు కారణంగానే టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వ్యక్తులను, పీఏలను, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నియమించుకోవద్దని తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు మంత్రుల వద్దకు చేరేందుకు…. గతంలో టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గత మంత్రుల వద్ద పనిచేసిన అనుభవంతో తాము ఉపయోగపడుతామంటూ కొత్త మంత్రులకు వల వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇదే తరహాలో బాలకృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తి పాగా వేశారు. డిప్యూటీ సీఎం వద్ద బాలకృష్ణ అనే వ్యక్తి చేస్తున్న హడావుడిపై సచివాలయంలోనూ పెద్దెత్తున చర్చ మొదలైంది. గతంలో టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వారు ఇప్పుడు తిరిగి కొత్త మంత్రుల వద్ద దర్శనం ఇస్తున్న విషయాన్ని కొందరు నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన జగన్‌ మోహన్ రెడ్డి… గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు, సిబ్బందిని కొత్త మంత్రులు నియమించుకోవడానికి వీల్లేదని…. ఈవిషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఎక్కడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు జగన్‌ మోహన్ రెడ్డి సూచించారు.

First Published:  28 Jun 2019 2:01 AM IST
Next Story