Telugu Global
NEWS

ప్రపంచకప్ సెమీస్ లో భారత్

విండీస్ పై 125 పరుగుల భారీ విజయం ఆరు రౌండ్లలో 5 విజయాల విరాట్ సేన విరాట్ కొహ్లీ వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ వన్డే ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మరో మూడురౌండ్ల మ్యాచ్ లు మిగిలి ఉండగానే సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ విండీస్ తో ముగిసిన 6వ రౌండ్ పోటీలో […]

ప్రపంచకప్ సెమీస్ లో భారత్
X
  • విండీస్ పై 125 పరుగుల భారీ విజయం
  • ఆరు రౌండ్లలో 5 విజయాల విరాట్ సేన
  • విరాట్ కొహ్లీ వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ

వన్డే ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మరో మూడురౌండ్ల మ్యాచ్ లు మిగిలి ఉండగానే సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది.

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ విండీస్ తో ముగిసిన 6వ రౌండ్ పోటీలో భారత్ 125 పరుగుల భారీ విజయంతో.. లీగ్ టేబుల్ రెండో స్థానంలో నిలిచింది.

విరాట్ షో….

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్…50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ 72, మాజీ కెప్టెన్ ధోనీ 56, యువఆటగాళ్లు రాహుల్ 48, పాండ్య 46 పరుగులతో నిలిచారు.

విరాట్ మొత్తం 82 బాల్స్ లో 8 బౌండ్రీలతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీకి ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

పాకిస్థాన్, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్థాన్, విండీస్ జట్ల పై కొహ్లీ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

షమీ సూపర్ స్పెల్…

269 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కరీబియన్ టాపార్డర్ కు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పట్టపగలే చుక్కలు చూపించాడు.

సునామీ ఓపెనర్ క్రిస్ గేల్, స్ట్రోక్ మేకర్లు హోప్, హెట్ మేయర్ లను తక్కువ స్కోర్లకే పెవీలియన్ దారి పట్టించడంతో భారత్ విజయానికి మార్గం సుగమయ్యింది.

విండీస్ జట్టు చివరకు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో షమీ 4, చహల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

విండీస్ పై 6-3తో భారత్ పైచేయి..

ప్రపంచకప్ లో విండీస్ ప్రత్యర్థిగా భారత్ తన విజయాల సంఖ్యను ఆరుకు పెంచుకొంది. ప్రస్తుత ప్రపంచ కప్ విజయంతో 6-3 రికార్డు సాధించింది.

ప్రపంచకప్ మిగిలిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీల్లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. సూపర్ సండే ఫైట్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  28 Jun 2019 2:05 AM IST
Next Story