Telugu Global
NEWS

పీసీసీ రేసు నుంచి తప్పుకున్న భట్టి.... కారణమిదే....

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో టీపీసీసీకి కొత్త సారథి నియమిస్తారన్న ప్రచారం బాగా జరిగింది. ముఖ్యంగా ఐదుగురి పేర్లు ఈ రేసులో ఉన్నట్టు…. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు…. ప్రచారం జరిగింది. పీసీసీ రేసులో ప్రముఖంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరేకాక కాంగ్రెస్ నేతలు శ్రీధర్ […]

పీసీసీ రేసు నుంచి తప్పుకున్న భట్టి.... కారణమిదే....
X

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో టీపీసీసీకి కొత్త సారథి నియమిస్తారన్న ప్రచారం బాగా జరిగింది.

ముఖ్యంగా ఐదుగురి పేర్లు ఈ రేసులో ఉన్నట్టు…. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు…. ప్రచారం జరిగింది. పీసీసీ రేసులో ప్రముఖంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరేకాక కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డిల పేర్లు కూడా వినిపించాయి.

అయితే తాజాగా ఈ రేసులో తాను లేనని మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పీసీసీ చీఫ్ పదవిని తాను అడిగితే…. తాను సీఎల్పీ నేతగా వైఫల్యం చెందినట్టేనని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ ను అసెంబ్లీలో ఎదుర్కొనే పదవినే తనకు ఇచ్చారని.. వెన్ను చూపి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.

అందుకే సీఎల్పీ లీడర్ గా ఉన్న తాను పీసీసీ చీఫ్ పదవి రేసులో లేనని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతో పీసీసీ రేసులో మిగిలిన నలుగురిలో ఒకరికి చాన్స్ ఉంటుందని స్పష్టమవుతోంది.

First Published:  28 Jun 2019 7:55 AM IST
Next Story