రాజకీయమా?.... లేక సినిమానా?
గత కొంతకాలంగా తమిళనాట ప్రముఖ యాక్టర్స్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు రాజకీయాల వైపు మొగ్గు చూపారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. హీరో సూర్య ని పెళ్లి చేసుకుని నటి జ్యోతిక కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైంది. ఈ మధ్యనే తన రెండవ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన ఈమె ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు […]
గత కొంతకాలంగా తమిళనాట ప్రముఖ యాక్టర్స్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు రాజకీయాల వైపు మొగ్గు చూపారు.
తాజాగా ప్రముఖ హీరోయిన్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. హీరో సూర్య ని పెళ్లి చేసుకుని నటి జ్యోతిక కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైంది. ఈ మధ్యనే తన రెండవ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన ఈమె ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేస్తోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఆమె ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వంపై మండిపడడం.
“తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కానీ వాటిల్లో కనీస సదుపాయాలు కూడా లేవు. నెలల పాటు, సంవత్సరాల పాటు టీచర్లు విధులకు రావడం లేదు. మరోవైపు సదుపాయాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. వాటిని సరి చేయాలి. విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలి” అని విరుచుకుపడింది జ్యోతిక. దాంతో ఆమె వచ్చే ఎన్నికల్లోపు రాజకీయాల్లో కి వస్తోందంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈమె త్వరలో ఈ అంశాలతోనే ‘రాక్షసి’ అనే సినిమాలో కనిపించబోతోంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా జ్యోతిక ఇలా మాట్లాడింది అని, ఆమెకి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని జ్యోతిక పీ.ఆర్. మేనేజర్ అంటున్నారు.