Telugu Global
NEWS

విరాట్ కొహ్లీ మరో ఫాస్టెస్ట్ రికార్డు

అత్యంత వేగంగా 20 వేల పరుగుల విరాట్  సచిన్, లారాలను అధిగమించిన కొహ్లీ 20వేల పరుగుల మూడో భారత క్రికెటర్ కొహ్లీ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ… అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. అత్యంత వేగంగా 20 వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కొహ్లీ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా…మాంచెస్టర్ వేదికగా ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో…కొహ్లీ వ్యక్తిగతంగా 37 పరుగుల స్కోరును […]

విరాట్ కొహ్లీ మరో ఫాస్టెస్ట్ రికార్డు
X
  • అత్యంత వేగంగా 20 వేల పరుగుల విరాట్
  • సచిన్, లారాలను అధిగమించిన కొహ్లీ
  • 20వేల పరుగుల మూడో భారత క్రికెటర్ కొహ్లీ

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ… అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. అత్యంత వేగంగా 20 వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కొహ్లీ రికార్డు నెలకొల్పాడు.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా…మాంచెస్టర్ వేదికగా ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో…కొహ్లీ వ్యక్తిగతంగా 37 పరుగుల స్కోరును చేయడంతోనే…మాస్టర్ సచిన్ టెండుల్కర్, బ్రయన్ లారాల పేర్లతో సంయుక్తంగా ఉన్న రికార్డు తెరమరుగయ్యింది.

417 ఇన్నింగ్స్ లోనే కొహ్లీ రికార్డు….

భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్, కరీబియన్ దిగ్గజం బ్రయన్ లారా…టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలిసి మొత్తం 453 ఇన్నింగ్స్ లో 20 వేల పరుగుల మైలురాయిని చేరితే…విరాట్ కొహ్లీ మాత్రం కేవలం 417 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సంపాదించడం విశేషం.

భారత మూడో క్రికెటర్ కొహ్లీ….

అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చోటు సంపాదించాడు. మాస్టర్ సచిన్, వాల్ రాహుల్ ద్రావిడ్ ల సరసన నిలిచాడు.

సచిన్ టెండుల్కర్ తన కెరియర్ లో మొత్తం 34వేల 357 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 24వేల 208 పరుగులు సాధించడం ద్వారా మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నారు.

సచిన్ మొత్తం పరుగులలో ..వన్డేల్లో 18వేల 426, టెస్టుల్లో 15వేల 921,టీ-20ల్లో 10 పరుగులు సాధించాడు.

రాహుల్ ద్రావిడ్ వన్డేలలో 10 వేల 889 పరుగులు, టెస్టుల్లో 13 వేల 288 పరుగులు, టీ-20 ల్లో 31 పరుగులు సాధించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల ప్రపంచ రికార్డు నెలకొల్పిన కొహ్లీ…ఇప్పుడు 20 వేల పరుగుల మైలురాయిని చేరడం విశేషం.

విరాట్ కొహ్లీకి టెస్టుల్లో 6వేల 613 పరుగులు, టీ-20 ఫార్మాట్లో 2వేల 263 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ…

2019 వన్డే ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్ల పైన కొహ్లీ అర్థశతకాలు సాధించడం విశేషం.

First Published:  27 Jun 2019 3:32 PM IST
Next Story