న్యూజిలాండ్ విజయాలకు పాకిస్థాన్ బ్రేక్
కివీస్ పై 6 వికెట్ల తో పాక్ విజయం ప్రపంచకప్ లో పాక్ సెమీస్ ఆశలు సజీవం ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో పడుతూ లేస్తూ సాగుతున్న మాజీ చాంపియన్ పాకిస్థాన్ కీలక విజయం సాధించింది. వరుస విజయాలతో సెమీస్ దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ కు బ్రేక్ వేసింది. బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ మ్యాచ్ లో పాక్ స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో న్యూజిలాండ్ జట్టుకు పగ్గాలు వేసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ 50 […]
- కివీస్ పై 6 వికెట్ల తో పాక్ విజయం
- ప్రపంచకప్ లో పాక్ సెమీస్ ఆశలు సజీవం
ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో పడుతూ లేస్తూ సాగుతున్న మాజీ చాంపియన్ పాకిస్థాన్ కీలక విజయం సాధించింది. వరుస విజయాలతో సెమీస్ దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ కు బ్రేక్ వేసింది.
బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ మ్యాచ్ లో పాక్ స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో న్యూజిలాండ్ జట్టుకు పగ్గాలు వేసింది.
టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ ఆటగాళ్లు నీషమ్ 97, గ్రాండ్ హోమీ 64 పరుగుల స్కోర్లతో తమజట్టును ఆదుకొన్నారు.
బాబర్ అజం సూపర్ సెంచరీ…
238 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పాక్..49.1 ఓవర్లలో 4వికెట్ల నష్టానికే విజయం సొంతం చేసుకోగలిగింది. వన్ డౌన్ ఆటగాడు బాబర్ 127 బాల్స్ లో 11 బౌండ్రీలతో 101 పరుగులతో నాటౌట్ గా నిలవడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.
ఇప్పటి వరకూ ఆడిన ఏడురౌండ్లలో పాక్ కు ఇది మూడో గెలుపు మాత్రమే. న్యూజిలాండ్ కు మాత్రం ప్రస్తుత టోర్నీలో ఇదే తొలి ఓటమి కావడం విశేషం.
న్యూజిలాండ్ 11 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండో స్థానంలో కొనసాగుతుంటే…పాక్ 7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.