జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.... 11 మంది మృతి
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో ఒక మినీ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది విద్యార్థినులు కావడం గమనార్హం. ఫూంచ్‌లోని ఒక కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులతో బయలుదేరిన మినీ వ్యాన్ పీర్-కీ-గలీ ప్రాంతంలో డివైడర్‌కు ఢీకొని లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే […]
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో ఒక మినీ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది విద్యార్థినులు కావడం గమనార్హం.
ఫూంచ్‌లోని ఒక కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులతో బయలుదేరిన మినీ వ్యాన్ పీర్-కీ-గలీ ప్రాంతంలో డివైడర్‌కు ఢీకొని లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని షోపియాన్‌లోని ఆసుపత్రికి తరలించారు.
బస్సు ప్రమాద వార్త తెలుసుకున్న జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.