Telugu Global
Health & Life Style

సంపూర్ణ ఆరోగ్యానికి గోరుచిక్కుడు

చిక్కుడు కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో గోరుచిక్కుళ్లకు ఆరోగ్యపరంగా ప్రత్యేక స్దానం ఉంది. దీనిని ఇంగ్లీష్ లో ఫింగర్ బీన్స్ అంటారు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గోరుచిక్కుళ్లు ఆరోగ్యంతో పాటు, చర్మాన్ని కూడా కాపాడుతాయి. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోరు చిక్కుళ్లలో పీచు అధికంగా ఉండడంతో ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. గోరు చిక్కుళ్లలో జింక్, కాపర్ కంటెంట్ ఉండడంతో ఇవి చర్మ […]

సంపూర్ణ ఆరోగ్యానికి గోరుచిక్కుడు
X

చిక్కుడు కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో గోరుచిక్కుళ్లకు ఆరోగ్యపరంగా ప్రత్యేక స్దానం ఉంది. దీనిని ఇంగ్లీష్ లో ఫింగర్ బీన్స్ అంటారు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

  • గోరుచిక్కుళ్లు ఆరోగ్యంతో పాటు, చర్మాన్ని కూడా కాపాడుతాయి. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • గోరు చిక్కుళ్లలో పీచు అధికంగా ఉండడంతో ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది.
  • గోరు చిక్కుళ్లలో జింక్, కాపర్ కంటెంట్ ఉండడంతో ఇవి చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
  • గోరు చిక్కుడులో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు.
  • ఇందులో విటమిన్లు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉన్నాయి. గోరుచిక్కుడు గర్బిణీలకు ఉత్తమమైన ఆహారం. కడుపులో పిండం ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది.
  • చర్మంపై వచ్చే మచ్చలు, డార్క్ సర్కిల్స్ ను తొలగించడానికి గోరుచిక్కుడు ఎంతో ఉపయోగపడుతుంది.
  • గోరుచిక్కుడులో ఉన్న ప్రొటీన్స్ చిన్నారుల ఎదుగుదలకు ఎంతో సహాయ పడుతుంది.
  • స్కిన్ టోన్ ను కాపాడుకోవాలంటే గోరుచిక్కుడును తరచూ తినాలని వైద్యులు చెబుతున్నారు.
  • సన్ బర్న్స్ లేదా సూర్య రశ్మి వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో గోరుచిక్కుడు ఎంతో మేలు చేస్తుంది.
First Published:  26 Jun 2019 11:33 PM IST
Next Story