ఇవీ సమావేశాలంటే.... కలెక్టర్ల కాన్ఫరెన్సు పై జగన్ కు కితాబు...!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ ల కాన్ఫరెన్స్ పైనా.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పైనా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలపై ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక తెలంగాణలో కూడా హర్షం వ్యక్తమవుతోంది. “అక్రమ కట్టడాల కూల్చివేత ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలి” అంటూ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ ల కాన్ఫరెన్స్ పైనా.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పైనా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలపై ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక తెలంగాణలో కూడా హర్షం వ్యక్తమవుతోంది.
“అక్రమ కట్టడాల కూల్చివేత ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలి” అంటూ ప్రకటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పనిని గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికతోనే ప్రారంభించడం భవిష్యత్తులో మంచి పాలన వస్తుందని ప్రజలకు భరోసా ఇస్తోందంటున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఇసుక మాఫియాలో భాగంగా మహిళా అధికారిపై చేయి చేసుకోవడాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “పోలీసు వ్యవస్థ ఇలాగేని ఉండేది?” అంటూ చురకలు కూడా వేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఏరి పారేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలెక్టర్ల సమావేశంలో కలకలం సృష్టించాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అంశాలపై గత ముఖ్యమంత్రి ఎప్పుడూ మాట్లాడిన సందర్భాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గత పాలనపై మండి పడుతూనే పోలీసులతో సహా ఇతర ప్రభుత్వ అధికారులు ఎలా మెలగాలో కలెక్టర్ల సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను అన్నా అని సంబోధిస్తూ… “నేను పాలనకు కొత్త. సుబ్రహ్మణ్యం అన్నా.., గౌతం అన్నా.. ఇతర సీనియర్ అధికారులు నన్ను ముందుండి నడిపించాలి. ప్రజలకు మంచి పాలన ఎలా ఉంటుందో మనందరం కలిసి చూపిద్దాం” అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు ప్రజలలోనూ, ఇటు అధికారులలో కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగ చేశాయంటున్నారు.