వల్లభనేని వంశీ కూడా జంపేనా?
చంద్రబాబును టీడీపీ నేతలు లైట్ తీసుకుంటుండడం, బీజేపీలోకి జారిపోతుండడంతో ఎప్పుడు ఏం చేయాలో తెలియక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. తాజాగా ప్రజావేదిక కూల్చివేత, బీజేపీ ఫిరాయింపులపై చంద్రబాబు నిర్వహించిన కీలక భేటీకి కాపు నేతలు, గోదావరి జిల్లాల కీలక నేతలు హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టీడీపీ లో అసంతృప్తిగా ఉన్న వల్లభనేని వంశీకి ఫోన్ చేసి బీజేపీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. […]
చంద్రబాబును టీడీపీ నేతలు లైట్ తీసుకుంటుండడం, బీజేపీలోకి జారిపోతుండడంతో ఎప్పుడు ఏం చేయాలో తెలియక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. తాజాగా ప్రజావేదిక కూల్చివేత, బీజేపీ ఫిరాయింపులపై చంద్రబాబు నిర్వహించిన కీలక భేటీకి కాపు నేతలు, గోదావరి జిల్లాల కీలక నేతలు హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టీడీపీ లో అసంతృప్తిగా ఉన్న వల్లభనేని వంశీకి ఫోన్ చేసి బీజేపీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన విజయవాడ సమీపంలోనే ఉండి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే కాకినాడలో టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు నేతృత్వంలో జ్యోతుల నెహ్రూ, పంచకర్ల నెహ్రూలు సమావేశమయ్యారు. వారు నేడు చంద్రబాబు నిర్వహించిన భేటికి కూడా హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా రాకపోవడంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
టీడీపీ నుంచి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఇప్పుడు బీజేపీలోకి వలసలు ప్రోత్సహించడం మొదలు పెట్టారట. పలువురికి ఫోన్లు కూడా చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది.
కొద్దికాలంగా టీడీపీ కార్యక్రమాలకు వల్లభనేని వంశీ దూరంగా ఉంటున్నారు. ఆయన అసంతృప్తిని పసిగట్టిన సుజనా పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన పార్టీ మారుతారన్న చర్చ సాగుతోంది. వంశీ ఫోన్లో కూడా టీడీపీ నేతలకు అందుబాటులో లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.