అత్యాచార బాధితురాలికి పరామర్శ.... 10 లక్షల పరిహారం ప్రకటించిన హోం మంత్రి
ఏపీలోని ఒంగోలులో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన బాలికను హోం మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనితతో కలసి బాధిత బాలికను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యాచార ఘటన గురించి సీఎం జగన్ ఆరా తీశారని.. బాలికకు అవసరమైన అన్ని రకాల సాయాలు అందించమని ఆదేశించినట్లు హోం మంత్రి తెలిపారు. బాధితురాలికి 10 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు.. పూర్తి భద్రత కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో […]
ఏపీలోని ఒంగోలులో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన బాలికను హోం మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనితతో కలసి బాధిత బాలికను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
అత్యాచార ఘటన గురించి సీఎం జగన్ ఆరా తీశారని.. బాలికకు అవసరమైన అన్ని రకాల సాయాలు అందించమని ఆదేశించినట్లు హోం మంత్రి తెలిపారు. బాధితురాలికి 10 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు.. పూర్తి భద్రత కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
రాబోయే కాలంలో అన్ని పాఠశాలల్లో ఇలాంటి ఘటనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని హోం మంత్రి వెల్లడించారు. పిల్లలు కూడా అపరిచితులను, ఇతరులను నమ్మ వద్దని.. తల్లిదండ్రుల కంటే నమ్మకస్తులు మరెవరూ ఉండరని సుచరిత చెప్పారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ దుర్మార్గానికి పాల్పడ్డవారు స్వపక్షంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోం మంత్రి స్పష్టం చేశారు.