Telugu Global
NEWS

ప్రజావేదికపై హైకోర్టులో చుక్కెదురు

ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తెల్లవారితే ప్రజావేదిక ఉండదు కాబట్టి వెంటనే విచారణ చేపట్టాలంటూ హౌజ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. దాంతో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో హౌజ్‌మోషన్‌ను హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం, అడిషినల్ ఏజీ సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని… అక్రమంగా నిర్మించిన భవనాన్ని ప్రభుత్వమే కూలుస్తోందని ఏజీ వాదించారు. దీన్ని ఆపడం సరికాదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ వాదనను అంగీకరించిన హైకోర్టు […]

ప్రజావేదికపై హైకోర్టులో చుక్కెదురు
X

ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తెల్లవారితే ప్రజావేదిక ఉండదు కాబట్టి వెంటనే విచారణ చేపట్టాలంటూ హౌజ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. దాంతో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో హౌజ్‌మోషన్‌ను హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం, అడిషినల్ ఏజీ సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

పిటిషన్లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని… అక్రమంగా నిర్మించిన భవనాన్ని ప్రభుత్వమే కూలుస్తోందని ఏజీ వాదించారు. దీన్ని ఆపడం సరికాదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ వాదనను అంగీకరించిన హైకోర్టు కూల్చివేతపై స్టేకు నిరాకరించింది. లోకాయుక్త ఆదేశాలు, సుప్రీం కోర్టు తీర్పులను, నదీ నిబంధనలను తోసిపుచ్చి అక్రమంగా గత ముఖ్యమంత్రి ఈ నిర్మాణం కట్టించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ తన పిటిషన్‌లో ప్రజావేదిక నిర్మాణానికి బాధ్యులైన వారి నుంచి సొమ్మును రికవరీ చేయాలని కూడా కోరారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. గత సీఎం చంద్రబాబు, గత మంత్రి నారాయణ నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని పిటిషనర్‌ కోరారు. సొమ్ము రికవరీపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

First Published:  26 Jun 2019 2:07 AM IST
Next Story