Telugu Global
National

రెండేళ్లలో 35 శాతం పెరిగిన ఏపీ అప్పు

గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థతో ఆడిన వికృత క్రీడలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సమయానికి ఏపీ వాటాగా 97వేల కోట్ల అప్పు వచ్చింది. దాన్ని ఐదేళ్లలో చంద్రబాబు ఏకంగా రూ. 2. 49 లక్షల కోట్లకు చేర్చేశారు. ఏపీ అప్పుపై రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. 2015 మార్చి నాటికి ఏపీ అప్పు రూ. 1, 48, 743 […]

రెండేళ్లలో 35 శాతం పెరిగిన ఏపీ అప్పు
X

గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థతో ఆడిన వికృత క్రీడలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సమయానికి ఏపీ వాటాగా 97వేల కోట్ల అప్పు వచ్చింది. దాన్ని ఐదేళ్లలో చంద్రబాబు ఏకంగా రూ. 2. 49 లక్షల కోట్లకు చేర్చేశారు.

ఏపీ అప్పుపై రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. 2015 మార్చి నాటికి ఏపీ అప్పు రూ. 1, 48, 743 కోట్లు ఉండగా… రెండేళ్లలోనే అది 35 శాతం పెరిగిందని ఆమె వివరించారు. 2015 మార్చి నుంచి 2017 మార్చి నాటికి వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్‌ అప్పు 35శాతం పెరిగి అది 2లక్షల 13వందల 14కోట్లకు చేరినట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

2018కి అప్పు రూ. 2, 25, 234 కోట్లకు చేరినట్టు చెప్పారు. 2019కి వచ్చే సరికి అప్పు ఏకంగా రెండు లక్షల 49 వేల 435 కోట్లకు చేరింది. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పుకు వడ్డీ కిందే 15,077 కోట్లు చెల్లిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

First Published:  26 Jun 2019 3:15 AM IST
Next Story