Telugu Global
NEWS

వైసీపీ హైకమాండ్ సీరియస్.... మున్సిపల్ చైర్మన్ రిజైన్

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజా తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ హైకమాండ్ ఆయన వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించడంతో రాజీనామా ఇచ్చేశారు. రెండు రోజుల క్రితం ఒక వ్యవహారంపై రాజా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. అనుచరులతో కలిసి స్టేషన్ వద్దకు వెళ్లి అర్ధనగ్నంగా బైఠాయించారు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులను తోసేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ కూడా సీరియస్‌గా స్పందించింది. జరిగిన ఘటనపై పోలీసులకు […]

వైసీపీ హైకమాండ్ సీరియస్.... మున్సిపల్ చైర్మన్ రిజైన్
X

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజా తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ హైకమాండ్ ఆయన వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించడంతో రాజీనామా ఇచ్చేశారు. రెండు రోజుల క్రితం ఒక వ్యవహారంపై రాజా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు.

అనుచరులతో కలిసి స్టేషన్ వద్దకు వెళ్లి అర్ధనగ్నంగా బైఠాయించారు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులను తోసేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ కూడా సీరియస్‌గా స్పందించింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఇంటూరి రాజా బహిరంగ క్షమాపణ చెప్పారు.

పార్టీకి తన వల్ల చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు అందచేశారు. తన రాజీనామాను అమోదించడమా లేదా అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రాజా చెప్పారు. పోలీసుల పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం లేదని… జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతున్నట్టు వెల్లడించారు.

First Published:  25 Jun 2019 4:20 AM IST
Next Story