ప్రపంచకప్ లో షకీబుల్ రేర్ డబుల్
అప్ఘన్ పై షకీబుల్ విశ్వరూపం 50 పరుగులు, 5 వికెట్లతో ఆల్ రౌండ్ షో యువరాజ్ సింగ్ సరసన షకీబుల్ ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ సూపర్ షో కొనసాగుతోంది. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో తన జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తూ సెమీస్ కు చేరువగా నిలిపాడు. సౌతాంప్టన్ వేదికగా పసికూన అప్ఘనిస్థాన్ తో ముగిసిన పోటీలో షకీబుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ సాధించడంతో […]
- అప్ఘన్ పై షకీబుల్ విశ్వరూపం
- 50 పరుగులు, 5 వికెట్లతో ఆల్ రౌండ్ షో
- యువరాజ్ సింగ్ సరసన షకీబుల్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ సూపర్ షో కొనసాగుతోంది. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో తన జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తూ సెమీస్ కు చేరువగా నిలిపాడు.
సౌతాంప్టన్ వేదికగా పసికూన అప్ఘనిస్థాన్ తో ముగిసిన పోటీలో షకీబుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు.. బౌలింగ్ లో 29 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
షకీబ్ ఆల్ రౌండ్ షోతో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో అప్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. ఇప్పటి వరకూ ఏడురౌండ్ల మ్యాచ్ లు ఆడిన బంగ్లాదేశ్ మూడు విజయాలు, మూడు పరాజయాలు, పర్షంతో రద్దయిన ఓ మ్యాచ్ తో 7 పాయింట్లు సాధించి…లీగ్ టేబుల్ 5వ స్థానంలో కొనసాగుతోంది.
యువీ సరసన షకీబుల్..
ప్రపంచకప్ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో …5 వికెట్లు, 50 పరుగులు సాధించిన తొలి ఆల్ రౌండర్ ఘనతను యువరాజ్ సింగ్ దక్కించుకొంటే.. ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ 50 పరుగులు, 5 వికెట్ల రికార్డుతో నిలిచాడు.
రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన ఏడు మ్యాచ్ ల్లో షకీబుల్ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా అత్యధిక పరుగుల మొనగాడిగా నిలిచాడు.
ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో సెంచరీలు బాదిన షకీబుల్.. న్యూజిలాండ్, అఫ్గన్ జట్లపై హాఫ్ సెంచరీలు సాధించాడు.