వింబుల్డన్ సీడింగ్స్ విధానంపై రాఫెల్ గరంగరం
ర్యాంక్ లను ఖాతరు చేయలేదంటూ ఆందోళన మిగిలిన గ్రాండ్ స్లామ్ టోర్నీలకు భిన్నంగా వింబుల్డన్ సీడింగ్స్ విలక్షణంగా వింబుల్డన్ సీడింగ్ విధానం గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలలోనే విలక్షణంగా కనిపించే వింబుల్డన్ సీడింగ్ విధానం పై… క్లే కోర్టు కింగ్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నడాల్ మండిపడుతున్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే 12 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ తో పాటు రెండోర్యాంకర్ గా ఉన్న నడాల్ కు…వచ్చేవారం ప్రారంభమయ్యే 2019 వింబుల్డన్ టోర్నీలో మూడో సీడింగ్ […]
- ర్యాంక్ లను ఖాతరు చేయలేదంటూ ఆందోళన
- మిగిలిన గ్రాండ్ స్లామ్ టోర్నీలకు భిన్నంగా వింబుల్డన్ సీడింగ్స్
- విలక్షణంగా వింబుల్డన్ సీడింగ్ విధానం
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలలోనే విలక్షణంగా కనిపించే వింబుల్డన్ సీడింగ్ విధానం పై… క్లే కోర్టు కింగ్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నడాల్ మండిపడుతున్నాడు.
తన కెరియర్ లో ఇప్పటికే 12 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ తో పాటు రెండోర్యాంకర్ గా ఉన్న నడాల్ కు…వచ్చేవారం ప్రారంభమయ్యే 2019 వింబుల్డన్ టోర్నీలో మూడో సీడింగ్ ఇవ్వనున్నారు.
జోకోవిచ్ కు టాప్ సీడింగ్….
పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ కు టాప్ సీడింగ్, గ్రాస్ కోర్టు కింగ్ రోజర్ ఫెదరర్ కు రెండు సీడింగ్స్ ఇచ్చారు.
ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం…రెండో స్థానంలో ఉన్న నడాల్ కు మూడో సీడింగ్స్ ఇవ్వటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అయితే…తనకు రెండు లేదా మూడు సీడింగ్స్ లో ఏది ఇచ్చినా ఒకటేనని, అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి విజయం సాధించగలిగితేనే మజా ఉంటుందని నడాల్ అంటున్నాడు.
నడాల్ కు సెమీస్ గండం…
మూడో సీడింగ్ రావడంతో నడాల్..సెమీస్ లోనే ఫెదరర్ లేదా జోకోవిచ్ తో తలపడే ప్రమాదం ఉంది. 2010 తర్వాతవింబుల్డన్ టైటిల్ నెగ్గని నడాల్ ..ప్రస్తుత టోర్నీలో హాట్ ఫేవరెట్ ఆటగాళ్లలో ఒకడిగా బరిలోకి దిగనున్నాడు.
గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ లోని ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ టోర్నీలలో ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రాతిపదికగానే సీడింగ్స్ ఇస్తూ వస్తున్నారు.
అయితే…వింబుల్డన్ నిర్వాహక సంఘం మాత్రం..గ్రాస్ కోర్టు టెన్నిస్ లో గత ఏడాదికాలంగా కనబరచిన ప్రతిభ, సాధించిన ర్యాంకింగ్ పాయింట్లు, వింబుల్డన్ గత రికార్డుల ప్రకారమే..సీడింగ్స్ ఇచ్చే సాంప్రదాయం ఉంది.
25వ సీడ్ గా సెరెనా…..
మహిళల సింగిల్స్ లో గత ఏడాది 128వ ర్యాంకులో ఉన్న మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ కు ..వింబుల్డన్ లో మాత్రం 25వ సీడింగ్ ఇవ్వనున్నారు.
వింబుల్డన్ సీడింగ్స్ ను నిర్వాహక సంఘం అధికారికంగా బుధవారం ప్రకటించనుంది.
జులై 1 నుంచి జులై 14 వరకూ రెండువారాలపాటు వింబుల్డన్ టోర్నీ జరుగనుంది.