నిన్న పవన్ తో.... ఈరోజు కాపు నాయకులతో.... మళ్లీ పార్టీ మార్పే....
వంగవీటి రాధా రాజకీయంగా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీని వీడి పెద్ద తప్పు చేశారు. అడిగిన సీటు ఇవ్వలేదని.. వేరే సీటు ఇచ్చారని జగన్ పై అలిగి తనకు బద్ధశత్రువైన టీడీపీలో రాధా చేరారు. అదే పెద్ద దుమారం రేపింది. టీడీపీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో…. అటు టీడీపీ భవిష్యత్తే గందరగోళంలో పడిపోయింది. టీడీపీలో ఉంటే తనకు గుర్తింపు ఉండదని భావించిన వంగవీటి రాధా తాజాగా […]
వంగవీటి రాధా రాజకీయంగా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీని వీడి పెద్ద తప్పు చేశారు. అడిగిన సీటు ఇవ్వలేదని.. వేరే సీటు ఇచ్చారని జగన్ పై అలిగి తనకు బద్ధశత్రువైన టీడీపీలో రాధా చేరారు. అదే పెద్ద దుమారం రేపింది.
టీడీపీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో…. అటు టీడీపీ భవిష్యత్తే గందరగోళంలో పడిపోయింది.
టీడీపీలో ఉంటే తనకు గుర్తింపు ఉండదని భావించిన వంగవీటి రాధా తాజాగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు.
తాజాగా మంగళవారం విజయవాడలోని పవన్ నివాసంలో ఈసారి కాపు నేతలు రామ్మోహన్, హరిప్రసాద్ తోపాటు రియాజ్ లతో కలిసి వంగవీటి రాధా జనసేనలో చేరికపై కీలక చర్చలు జరిపినట్టు సమాచారం.
దివంగత వంగవీటి రంగా జయంతి అయిన జూలై 4న ఆయన టీడీపీని వీడి జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే రాధా జనసేనలో చేరిక వార్తలపై అటు ఆయన నుంచి కానీ.. జనసేన నుంచి కానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.