Telugu Global
NEWS

రేప్‌లపై రాజకీయం చేస్తున్న లోకేష్

మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్‌ కొత్త ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ప్రభుత్వంపై దాడికి ఇప్పటికీ సరైన అస్త్రం దొరకని నేపథ్యంలో స్థాయిని పక్కన పెట్టి విమర్శలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒంగోలులో మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని లోకేష్ రాజకీయకోణంలో తెరపైకి తెచ్చారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి పాదయాత్ర సమయంలో జగన్‌తో ఫోటో దిగడంతో…. ఆ ఫోటోను ట్వీట్ చేసి వైసీపీ కార్యకర్తలే బాలికపై అత్యాచారం చేశారని ఆరోపించారు. దీన్ని బట్టే జగన్ పాలనలో […]

రేప్‌లపై రాజకీయం చేస్తున్న లోకేష్
X

మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్‌ కొత్త ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ప్రభుత్వంపై దాడికి ఇప్పటికీ సరైన అస్త్రం దొరకని నేపథ్యంలో స్థాయిని పక్కన పెట్టి విమర్శలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.

ఒంగోలులో మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని లోకేష్ రాజకీయకోణంలో తెరపైకి తెచ్చారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి పాదయాత్ర సమయంలో జగన్‌తో ఫోటో దిగడంతో…. ఆ ఫోటోను ట్వీట్ చేసి వైసీపీ కార్యకర్తలే బాలికపై అత్యాచారం చేశారని ఆరోపించారు. దీన్ని బట్టే జగన్ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్నది స్పష్టమవుతోందని లోకేష్ ఆరోపించారు.

లోకేష్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యాచారం చేసిన వ్యక్తులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి… ఇలా బాలిక అత్యాచారానికి రాజకీయ రంగు పులమడం సిగ్గుగా అనిపించడం లేదా లోకేష్? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

గతంలో అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు స్వయంగా శ్రమశక్తి అవార్డు ఇచ్చారు కదా…. అప్పుడు కూడా చంద్రబాబు, మీరు దగ్గరుండి రేప్‌లను చేయించారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

అత్యాచారానికి గురైన బాలికపై అంత సానుభూతి ఉంటే ఇప్పటి వరకు మీరు గానీ, మీ పార్టీ వాళ్లు గానీ పరామర్శించారా? అని నిలదీస్తున్నారు.

ముందు మీ తరపున ట్వీట్లు పెట్టే టీంను ప్రక్షాళన చేసుకుని కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న వారిని నియమించుకోండి అని మరికొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

ఏమీ లేక చివరకు రేపుల మీద రాజకీయం చేసుకునే స్థాయికి వెళ్లిపోవడం బాధాకరమని ఇంకొందరు లోకేష్‌పై సానుభూతి చూపుతున్నారు.

First Published:  25 Jun 2019 4:00 PM IST
Next Story