"కష్టం సర్" అంటూ నమస్కరించిన సీఎస్ ఎల్వీ
కలెక్టర్ల సదస్సులో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. విద్యాశాఖపై సమీక్ష సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై చర్చ జరిగింది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతనాలు సరిగా ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకొరగా జీతాలు ఇస్తుంటారని.. అందుకే పారిశుద్ధ్య కార్మికులు పనిచేయకుండా ఉంటారని జగన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి వారికి జీతం 18 వేలు ఇవ్వాలని జగన్ సూచించారు. దాంతో ప్రభుత్వ […]

కలెక్టర్ల సదస్సులో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. విద్యాశాఖపై సమీక్ష సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై చర్చ జరిగింది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతనాలు సరిగా ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అరకొరగా జీతాలు ఇస్తుంటారని.. అందుకే పారిశుద్ధ్య కార్మికులు పనిచేయకుండా ఉంటారని జగన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి వారికి జీతం 18 వేలు ఇవ్వాలని జగన్ సూచించారు. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం… సరదాగా కష్టం సర్ అంటూ చేతులెత్తి నమస్కరించారు.
జోక్యం చేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరిగి జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి… పారిశుద్ధ్య కార్మికులకు 18వేలు ఇవ్వాలని… లక్ష రూపాయలు ఇచ్చినా వారు చేసే పని మనం చేయగలమా అని జగన్ ప్రశ్నించారు. అంతటితో ఆ అంశంపై చర్చ ముగిసింది.