ప్రజావేదికను పార్లమెంట్‌తో పోల్చిన జేపీ
లోక్‌సత్తా జేపీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎన్నో ఘోరాలు జరిగినా నిస్సాయంగా చూస్తూ ఉండిపోయిన జయప్రకాశ్ నారాయణ… గత నెల రోజులుగా మాత్రం యూట్యూబ్‌లో బాగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అదేంటో గానీ యూట్యూబ్‌లో ఆయనకు సంబంధించి ఎక్కువ వీడియోల టైటిల్స్ కొత్త ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నట్టుగానే ఉంటున్నాయి. తాజాగా కృష్ణా నది బెడ్‌లో కట్టిన అక్రమకట్టడం ప్రజావేదికను కూల్చేయాలన్న నిర్ణయం పైనా జేపీ అదోలా స్పందించారు. ప్రజావేదిక భవనం ఎందుకు కూలుస్తున్నారో… అందుకు […]
లోక్‌సత్తా జేపీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎన్నో ఘోరాలు జరిగినా నిస్సాయంగా చూస్తూ ఉండిపోయిన జయప్రకాశ్ నారాయణ… గత నెల రోజులుగా మాత్రం యూట్యూబ్‌లో బాగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.
అదేంటో గానీ యూట్యూబ్‌లో ఆయనకు సంబంధించి ఎక్కువ వీడియోల టైటిల్స్ కొత్త ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నట్టుగానే ఉంటున్నాయి.
తాజాగా కృష్ణా నది బెడ్‌లో కట్టిన అక్రమకట్టడం ప్రజావేదికను కూల్చేయాలన్న నిర్ణయం పైనా జేపీ అదోలా స్పందించారు. ప్రజావేదిక భవనం ఎందుకు కూలుస్తున్నారో… అందుకు బలమైన కారణాలు చూపాలి అంటూనే పార్లమెంట్ భవనంతో దాన్ని పోల్చారు. పార్లమెంట్ భవనాలను బ్రిటిష్ వాళ్లు కట్టారని.. అలా అని వాటిని కూల్చలేదు కదా అని ప్రశ్నించారు.
రాచరికం తరహాలో కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడం సరైన పద్దతి కాదన్నారు. ఫిరాయింపులపైనా మాట్లాడారు జేపీ. ఫిరాయింపులను అందరూ ప్రోత్సహిస్తున్నారని చరిత్ర మొత్తం చెప్పారు. కానీ ఫిరాయింపులకు పాల్పడితే తక్షణం వేటు వేయండి అంటూ అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన గురించి మాత్రం స్పందించలేదు.