అక్రమ కట్టడాలు కూల్చాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేపట్టిన అన్ని అక్రమ కట్టడాలను సమూలంగా కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు విదేశాలలో ఉంటున్న తెలుగు వారు కూడా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అప్రజాస్వామిక పాలన జరిగిందని, ఆ సమయంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కాలిఫోర్నియాకు చెందిన ఎన్ ఆర్ ఐ పవన్ అభిప్రాయపడ్డారు. ఓ ఛానెల్ లో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాలపై నిర్వహించిన […]
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేపట్టిన అన్ని అక్రమ కట్టడాలను సమూలంగా కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు విదేశాలలో ఉంటున్న తెలుగు వారు కూడా అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అప్రజాస్వామిక పాలన జరిగిందని, ఆ సమయంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కాలిఫోర్నియాకు చెందిన ఎన్ ఆర్ ఐ పవన్ అభిప్రాయపడ్డారు.
ఓ ఛానెల్ లో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాలపై నిర్వహించిన చర్చ గోష్టిలో పవన్ టెలీఫోన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు.
“చంద్రబాబు నాయుడి హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. అందులో కరకట్టపై అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటిని తప్పకుండా కూల్చివేయాల్సిందే” అని పవన్ అన్నారు.
సామాన్యులు ఐదు అడుగులు ముందుకు వస్తేనే నిబంధనలు ఉల్లఘించారంటూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అలాంటిది ఏకంగా ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు ఉపేక్షించాలని ఆయన అన్నారు. “కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలా సాహసోపేతమైనవి. చంద్రబాబు నాయుడి హయాంలో అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేశారు. వాటిపై జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం మంచి పరిణామం” అని కాలిఫోర్పియా నుంచి పవన్ టెలీఫోన్ లో తెలిపారు.
ఈ చర్చా గోష్టిలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన మరో కాలర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం కలుగుతుందని అన్నారు.
” గత ప్రభుత్వ హయాంలో కట్టిన అక్రమ కట్టడాలన్నింటిని తప్పకుండా కూల్చివేయాలి. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై.. ముఖ్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు ఎంతో విశ్వాసం పెరుగుతుంది” అని ఆ కాలర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటే 2024 లో జరిగే ఎన్నికల్లో కూడా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
చర్చలో పాల్గొన్న తెలంగాణకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు.