Telugu Global
National

సీఎం రమేష్ మ్యాచ్ ఫిక్సింగ్ లో మరో కోణం

టీడీపీ ఎంపీ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ బీజేపీలో చేరడంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎన్నో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎం రమేష్ బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసేందుకు లేఖ ఇవ్వడానికి ముందు సీఎం రమేష్ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈనెల 14న చంద్రబాబు […]

సీఎం రమేష్ మ్యాచ్ ఫిక్సింగ్ లో మరో కోణం
X

టీడీపీ ఎంపీ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ బీజేపీలో చేరడంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎన్నో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎం రమేష్ బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది.

టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసేందుకు లేఖ ఇవ్వడానికి ముందు సీఎం రమేష్ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈనెల 14న చంద్రబాబు నిర్వహించిన సమామేశానికి టీజీ వెంకటేశ్ మినహా బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజన, గరికపాటి హాజరయ్యారు. సీఎం రమేష్ మూడు రోజులు బాబుతో ఏకాంతంగా చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడం.. సీఎం రమేష్ బీజేపీలో చేరడం జరిగిపోయింది. అంతకుముందు సీఎం రమేష్ సీఎంతో సన్నిహితంగా ఉండి భోజనం కూడా చేశారని అక్కడ చూసిన వారి నుంచి ఆనోటా ఈ నోటా ఇది ప్రచారంలోకి వచ్చింది.

దీంతో పక్కా చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎం రమేష్ ఐటీ, ఈడీ కేసుల నుంచి విముక్తి పొందడానికే బీజేపీలో చేరినట్టు అర్థమవుతోందని వైసీపీ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

First Published:  25 Jun 2019 1:35 PM IST
Next Story