ప్రపంచకప్ లో సఫారీల ప్యాకప్
పాక్ చేతిలోనూ సౌతాఫ్రికాకు తప్పని ఓటమి రౌండ్ రాబిన్ లీగ్ దశలోనే సౌతాఫ్రికా ఇంటికి… ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ బరిలోకి హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా పోటీకి దిగిన సౌతాఫ్రికా… రౌండ్ రాబిన్ లీగ్ దశలోనే దారుణంగా విఫలమయ్యింది. 7 రౌండ్లలో ఐదు పరాజయాలతో సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు దూరమయ్యింది. పాక్ చేతిలో సఫారీల సఫా… క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన కీలక రౌండ్ రాబిన్ లీగ్ […]
- పాక్ చేతిలోనూ సౌతాఫ్రికాకు తప్పని ఓటమి
- రౌండ్ రాబిన్ లీగ్ దశలోనే సౌతాఫ్రికా ఇంటికి…
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ బరిలోకి హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా పోటీకి దిగిన సౌతాఫ్రికా… రౌండ్ రాబిన్ లీగ్ దశలోనే దారుణంగా విఫలమయ్యింది. 7 రౌండ్లలో ఐదు పరాజయాలతో సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు దూరమయ్యింది.
పాక్ చేతిలో సఫారీల సఫా…
క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన కీలక రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో మాజీ చాంపియన్ పాకిస్థాన్ 49 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న పాక్ జట్టు…50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫకర్ జమాన్ చెరో 44 పరుగులు, వన్ డౌన్ బాబర్ అజం 69, మిడిలార్డర్ ఆటగాడు హారిస్ సోహెయిల్ 89 పరుగులు సాధించారు.
సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 2 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ ఎన్ గిడీ 3 వికెట్లు పడగొట్టారు.
సౌతాఫ్రికా ఎదురీత…
సమాధానంగా 309 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన సౌతాఫ్రికాజట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ డికాక్ 47, కెప్టెన్ డూప్లెసీ 63, లోయర్ ఆర్డర్ ఆటగాడు పెహ్లూవాయా 46 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది.
49 పరుగులతో నెగ్గిన పాక్ జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించిన హారిస్ సోహెయిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మొత్తం ఆరురౌండ్లలో పాక్ జట్టుకు ఇది రెండో గెలుపు కాగా… సౌతాఫ్రికా కు 7 రౌండ్లలో 5వ ఓటమి కావటం విశేషం.
మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ టేబుల్ లో సౌతాఫ్రికా 9వ స్థానంలో ఉంటే…5 పాయింట్లతో పాక్ జట్టు 7వ స్థానంలో కొనసాగుతోంది.