నా పదవి ఎన్నికల వరకే పరిమితం.... నేను కార్యకర్తను మాత్రమే....
సినిమాల్లో స్టార్ గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నటి విజయశాంతి. మొదటగా భారతీయ జనతా పార్టీ లో కి అడుగు పెట్టి, ఆ పై సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి, చివరికి దానిని తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అయితే నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కొర్ కమిటీ సమావేశానికి ముఖ్య నాయకురాలయిన విజయ శాంతి కి ఆహ్వానం అందలేదు. ఇదే విషయం […]
సినిమాల్లో స్టార్ గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నటి విజయశాంతి. మొదటగా భారతీయ జనతా పార్టీ లో కి అడుగు పెట్టి, ఆ పై సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి, చివరికి దానిని తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
అయితే నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కొర్ కమిటీ సమావేశానికి ముఖ్య నాయకురాలయిన విజయ శాంతి కి ఆహ్వానం అందలేదు. ఇదే విషయం పై ఆవిడ ట్విట్టర్ లో స్పందించారు.
ఈరోజు గోల్కొండ హోటల్లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదని మీడియా వాళ్లు నన్ను అడుగుతున్నారు.
ఈ రోజు జరిగిన కోర్ కమిటీ సమావేశం గురించి నాకు తెలియదు.
సమాచారం కూడా లేదు.
నా ప్రచార కమిటీ చైర్మన్ ఎన్నికల వరకే పరిమితం pic.twitter.com/JVr52Dpv0h— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 23, 2019
“ఈరోజు గోల్కొండ హోటల్లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదని మీడియా వాళ్లు నన్ను అడుగుతున్నారు. ఈ రోజు జరిగిన కోర్ కమిటీ సమావేశం గురించి నాకు తెలియదు. సమాచారం కూడా లేదు. నా ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఎన్నికల వరకే పరిమితం. ప్రస్తుతం నేను సోనియా గౌరవించి కండువకప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న కార్యకర్తను మాత్రమే” అని విజయశాంతి పేర్కొన్నారు.
మరి ఈ విషయం పై కాంగ్రెస్ పార్టీ లో ఎవరైనా స్పందిస్తారా లేదా అని చూడాలి. ఇక పోతే, త్వరలో నే విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ప్రస్తుతం నేను సోనియా గౌరవించి కండువకప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న కార్యకర్తను మాత్రమే.
విజయశాంతి.— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 23, 2019