Telugu Global
International

దేశంలో అసహనం... విదేశాల ఆశ్రయం కోరుతున్న భారతీయులు

భారత్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. తమకు ఆశ్రయం ఇవ్వాలని ఇతర దేశాలకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభాల సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. భారత్‌లో అలాంటి పరిస్థితి లేకపోయినా చాలా మంది విదేశాలను ఆశ్రయం కల్పించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2008-09 మధ్య అమెరికా, కెనడాలను ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుతున్న భారతీయ […]

దేశంలో అసహనం... విదేశాల ఆశ్రయం కోరుతున్న భారతీయులు
X

భారత్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. తమకు ఆశ్రయం ఇవ్వాలని ఇతర దేశాలకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభాల సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి.

భారత్‌లో అలాంటి పరిస్థితి లేకపోయినా చాలా మంది విదేశాలను ఆశ్రయం కల్పించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2008-09 మధ్య అమెరికా, కెనడాలను ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుతున్న భారతీయ సంఖ్య 28వేల 498గా ఉంది. కెనడా ఆశ్రయాన్ని కోరిన భారతీయుల సంఖ్య 5522గా ఉంది. దక్షిణాఫ్రికాకు 4329 మంది, ఆస్ట్రేలియాకు 3584 మంది, దక్షిణకొరియాకు 1657 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వీరు ఇలా విదేశాలను ఆశ్రయం కోరడానికి ప్రధాన కారణం భారతదేశంలో పెరుగుతున్న అసహనమేనని భావిస్తున్నారు.

అటు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ఒక నివేదికను విడుదల చేసింది. భారత దేశంలో హిందూ అతివాద సంస్థలు పెరుగుతున్నాయని నివేదికలో అమెరికా వెల్లడించింది. అయితే అమెరికా నివేదికను భారత్ విదేశాంగ శాఖ ఖండించింది. భారత్‌లోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి ఉండదని ప్రకటించింది. భారత్‌లో మత స్వాతంత్ర్యం ఉందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

First Published:  24 Jun 2019 3:36 AM IST
Next Story