Telugu Global
NEWS

50 శాతం మహిళలకు రిజర్వేషన్ తో వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల వాలంటీర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాల లోనూ సచివాలయ లను ఏర్పాటు చేస్తామని, వాటికి వాలంటీర్ లను నియమించి వారి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పాటు వాటికి వాలంటీర్ లను నియమించే పనిని ప్రారంభించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ […]

50 శాతం మహిళలకు రిజర్వేషన్ తో వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
X

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల వాలంటీర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాల లోనూ సచివాలయ లను ఏర్పాటు చేస్తామని, వాటికి వాలంటీర్ లను నియమించి వారి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పాటు వాటికి వాలంటీర్ లను నియమించే పనిని ప్రారంభించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున నియమించాలని, వారికి నెలకు ఐదు వేల రూపాయల వేతనం చెల్లిస్తామని వాలంటీర్ ల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రామ వాలంటీర్ ఉద్యోగాల లో 50 శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వాలంటీర్ ఉద్యోగాలకు 25 నుంచి 35 సంవత్సరాల వయోపరిమితిని నిర్ణయించారు. ఇక అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులు కావాలి.

గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామ వాలంటీర్ ల విద్యార్హతల్లో సడలింపు చేశారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామ వాలంటీర్ ల ఉద్యోగాలకు పదవ తరగతి పాస్ అయిన వారు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జూన్ 10 వ తేదీన అభ్యర్థుల అప్లికేషన్ లను పరిశీలించి వాలంటీర్ ఉద్యోగాల భక్తి ప్రక్రియను ప్రారంభిస్తారు.

ఆగస్టు ఒకటవ తేదీన ఎన్నికైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. వాలంటీర్ లుగా ఉద్యోగాలు పొందిన వారందరికీ ఆయా మండలాలలో ఆగస్టు 10వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15వ తేదీ…. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి వాలంటీర్ ల పని ప్రారంభం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది.

First Published:  23 Jun 2019 9:23 AM IST
Next Story