Telugu Global
Cinema & Entertainment

కబాలి దర్శకుడికి కోర్టు లో ఎదురు దెబ్బ.... ఇక అరెస్టే...!

తమిళ్ సినిమా పరిశ్రమ లో ఒకేసారి రజినీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు పా రంజిత్. మద్రాస్ సినిమా తర్వాత ఎంతో పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు వెంటనే రజినీకాంత్ దృష్టి లో పడి వరుసగా రెండు సినిమాలు చేసాడు. ఏవ్ కబాలి, కాలా. రెండు సినిమాలు అనుకున్న స్థాయి లో అయితే ఆడలేదు. రజినీకాంత్ కి నటుడిగా పేరొచ్చింది కానీ సినిమా కి పెద్దగా లాభాలు రాలేదు, అభిమానులు కూడా […]

కబాలి దర్శకుడికి కోర్టు లో ఎదురు దెబ్బ.... ఇక అరెస్టే...!
X

తమిళ్ సినిమా పరిశ్రమ లో ఒకేసారి రజినీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు పా రంజిత్. మద్రాస్ సినిమా తర్వాత ఎంతో పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు వెంటనే రజినీకాంత్ దృష్టి లో పడి వరుసగా రెండు సినిమాలు చేసాడు. ఏవ్ కబాలి, కాలా. రెండు సినిమాలు అనుకున్న స్థాయి లో అయితే ఆడలేదు. రజినీకాంత్ కి నటుడిగా పేరొచ్చింది కానీ సినిమా కి పెద్దగా లాభాలు రాలేదు, అభిమానులు కూడా ఈ సినిమాల విషయం లో కాస్త నిరుత్సాహ పడ్డారు.

అయితే ఇటీవలే ఆయన తిరుప్పనందళ్‌ గ్రామంలో రాజరాజ చోళన్‌ను కించపరచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు గానూ ఆయన మీద స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదే విషయం పై మధురై హైకోర్టులో ఈ దర్శకుడి పై ఒక పిటీషన్ కూడా దాఖలు అయింది. అయితే దర్శకుడు తెలివిగా వ్యవహరించి మందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకున్నారు.

కాకపోతే ఈ నెల 21వ తేదీ వరకూ అరెస్ట్‌ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ గడువు పూర్తి కావడం తో ఆయన మళ్ళీ అప్పీల్ చేయడం తో పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది కోర్టు. ఇక ఇప్పుడు పోలీసులు పా.రంజిత్‌ను త్వరలో నే అరెస్ట్ చేయనున్నారు.

First Published:  23 Jun 2019 9:52 AM IST
Next Story