కాంగ్రెస్, టీడీపీలకు షాక్.... బీజేపీలోకి సర్వే, మోత్కుపల్లి...?
తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అటు కేంద్రంలోని బీజేపీ కంకణం కట్టుకున్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే అనాదిగా కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలబడ్డ రెడ్లపై నజర్ పెట్టింది. కోమటిరెడ్డి సహా కాంగ్రెస్ లోని పెద్ద రెడ్డీ లీడర్లను లాగేయడానికి బీజేపీ స్కెచ్ గీసింది. ఇక వీరే కాదు.. కాంగ్రెస్ లో రాజకీయ ఉపాధి లేక.. పట్టించుకోని వారందరూ ఇప్పుడు బీజేపీవైపే చూస్తున్నారు. టీడీపీలో వెలుగు వెలిగి ఇప్పుడు కనుమరుగైన నేతలకు కూడా […]
తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అటు కేంద్రంలోని బీజేపీ కంకణం కట్టుకున్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే అనాదిగా కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలబడ్డ రెడ్లపై నజర్ పెట్టింది. కోమటిరెడ్డి సహా కాంగ్రెస్ లోని పెద్ద రెడ్డీ లీడర్లను లాగేయడానికి బీజేపీ స్కెచ్ గీసింది.
ఇక వీరే కాదు.. కాంగ్రెస్ లో రాజకీయ ఉపాధి లేక.. పట్టించుకోని వారందరూ ఇప్పుడు బీజేపీవైపే చూస్తున్నారు. టీడీపీలో వెలుగు వెలిగి ఇప్పుడు కనుమరుగైన నేతలకు కూడా బీజేపీయే కొండంత ఆశాదీపంలా కనపడడం విశేషంగా మారింది.
తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కొద్దిరోజుల క్రితం నుంచి తెలంగాణ, ఏపీ నేతలపై దృష్టి సారించి సంప్రదింపులు జరుపుతున్నాడు. తాజాగా నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన నేతలతో రాంమాధవ్ చర్చలు జరిపినట్టు తెలిసింది.
ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్ మాజీ ఎంపీ బలరాం నాయక్, టీడీపీ సీనియర్ నేతలు పెద్దారెడ్డి, చాడా సురేష్ రెడ్డి, బోడ జనార్ధన్ సహా పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మోత్కుపల్లి కూడా వీరితో పాటు బీజేపీలో చేరుతున్నారు. వీరిని బీజేపీలో చేర్చుకోవడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలను కలిసి వివరించారు. దీంతో వీరి చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.