ప్రపంచకప్ లో నాడు అజర్...నేడు విరాట్ కొహ్లీ
విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ ఆసీస్, పాక్, అప్ఘన్ జట్లపై కొహ్లీ అర్థశతకాలు అజరుద్దీన్ సరసన విరాట్ కొహ్లీ భారత కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్…వన్డే ప్రపంచకప్ లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించాడు. సౌతాంప్టన్ వేదికగా అఫ్గనిస్థాన్ తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో […]
- విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్
- ఆసీస్, పాక్, అప్ఘన్ జట్లపై కొహ్లీ అర్థశతకాలు
- అజరుద్దీన్ సరసన విరాట్ కొహ్లీ
భారత కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్…వన్డే ప్రపంచకప్ లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించాడు. సౌతాంప్టన్ వేదికగా అఫ్గనిస్థాన్ తో
జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లతో ముగిసిన మ్యాచ్ ల్లో కొహ్లీ హాఫ్ సెంచరీలు సాధించాడు.
అంతేకాదు…బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుకాని హాంప్ షైర్ ఓవల్ వికెట్ పైన సైతం కొహ్లీ ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు.
వన్డే క్రికెట్లో కొహ్లీ 52వ హాఫ్ సెంచరీని 5 బౌండ్రీలతో పూర్తి చేయటం విశేషం.
ప్రస్తుత అఫ్ఘన్ మ్యాచ్ వరకూ తన కెరియర్ లో 231 వన్డేలలో 223 ఇన్నింగ్స్ ఆడిన కొహ్లీకి 41 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో సహా 11వేల 80కి పైగా పరుగులు సాధించిన రికార్డు ఉంది.
1992 ప్రపంచకప్ లో నాటి భారత కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ వరుసగా మూడుమ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలతో హ్యాట్రిక్ సాధించిన భారత తొలికెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.
ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ సైతం అదే ఘనత సాధించి..అజర్ సరసన నిలిచాడు.