ప్రజా వేదికలోనూ 4 కోట్లు మింగేశారు...!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే నిర్మించిన ప్రజావేదికలో అవినీతి బట్టబయలైంది. ప్రజావేదిక నిర్మాణం లో జరిగిన అవినీతిని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. సీఆర్డీఏ అనుమతి లేకుండానే ఈ నిర్మాణాలు జరిపినట్టు గుర్తించింది. ఈ ప్రజావేదిక నిర్మాణం కోసం మొదట 5 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించారు. కానీ ఆతర్వాత దీనిని 8.90 కోట్లుగా మార్చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ కు సీఆర్డీఏ అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే ఈ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు […]
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే నిర్మించిన ప్రజావేదికలో అవినీతి బట్టబయలైంది. ప్రజావేదిక నిర్మాణం లో జరిగిన అవినీతిని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. సీఆర్డీఏ అనుమతి లేకుండానే ఈ నిర్మాణాలు జరిపినట్టు గుర్తించింది.
ఈ ప్రజావేదిక నిర్మాణం కోసం మొదట 5 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించారు. కానీ ఆతర్వాత దీనిని 8.90 కోట్లుగా మార్చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ కు సీఆర్డీఏ అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే ఈ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు…. అప్పటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే పనులు అప్పగించారని సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నివేదికతో బయటపడింది.
ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకే ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెట్టినట్లు కొత్త ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు లా స్టార్ హోటళ్లలో పెట్టి దుబారా చేసే ఆలోచన తమకు లేదని అంటోంది. ప్రజావేదిక నిర్మాణంలో కూడా చంద్రబాబు దోపిడీ చేశారని మంత్రి బొత్స విమర్శించారు. అనుమతులు లేకుండా 5 కోట్ల అంచనాలను 8.9 కోట్ల కు పెంచేసి దోచేశారని అన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని…. వీటిని ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.