అమ్మ ఒడి అందరికీ " సీఎం ప్రకటన
అమ్మ ఒడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన ఇటీవల చెప్పగా… విద్యా శాఖ మంత్రి ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తింపచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో గందరగోళం ఏర్పడింది. దీనికి తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అమ్మ ఒడి అన్ని పాఠశాలలకు వర్తింప చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడ […]

అమ్మ ఒడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన ఇటీవల చెప్పగా… విద్యా శాఖ మంత్రి ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తింపచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో గందరగోళం ఏర్పడింది. దీనికి తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
అమ్మ ఒడి అన్ని పాఠశాలలకు వర్తింప చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడ పిల్లలను చదివించినా 15వేలు ప్రభుత్వం ఇస్తుందని వివరించింది. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఈ పథకం ఉద్దేశమని వెల్లడించింది.
దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 శాతం ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునేలా చేయడమే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని సీఎంవో ప్రకటించింది.