Telugu Global
NEWS

ప్రపంచనంబర్ వన్ జట్టుకు షాక్ మీద షాక్

రౌండ్ రాబిన్ లీగ్ లో ఇంగ్లండ్ జట్టుకు శ్రీలంక ఝలక్ లో స్కోరింగ్ మ్యాచ్ లో టాప్ ర్యాంక్ టీమ్ బోల్తా ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది. హాట్ ఫేవరెట్ , టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ కు మాజీ చాంపియన్ శ్రీలంక షాకిచ్చింది. హెడింగ్లే వేదికగా ముగిసిన మ్యాచ్ లో డార్క్ హార్స్ శ్రీలంక…పవర్ ఫుల్ ఇంగ్లండ్ పై అన్యూహ్య విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక […]

ప్రపంచనంబర్ వన్ జట్టుకు షాక్ మీద షాక్
X
  • రౌండ్ రాబిన్ లీగ్ లో ఇంగ్లండ్ జట్టుకు శ్రీలంక ఝలక్
  • లో స్కోరింగ్ మ్యాచ్ లో టాప్ ర్యాంక్ టీమ్ బోల్తా

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది. హాట్ ఫేవరెట్ , టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ కు మాజీ చాంపియన్ శ్రీలంక షాకిచ్చింది.

హెడింగ్లే వేదికగా ముగిసిన మ్యాచ్ లో డార్క్ హార్స్ శ్రీలంక…పవర్ ఫుల్ ఇంగ్లండ్ పై అన్యూహ్య విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక 50 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగాలేని హెడింగ్లే పిచ్ పైన శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 115 బాల్స్ లో ఓ సిక్సర్, 5 బౌండ్రీలతో సహా 85 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మలింగ మ్యాజిక్…

233 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్లలోనే డాషింగ్ ఓపెనర్ బెయిర్ స్టో ను మలింగ డకౌట్ గా పడగొట్టాడు.

మరో ఓపెనర్ విన్సీ సైతం మలింగ బౌలింగ్ లోనే దొరికిపోయాడు. మాజీ కెప్టెన్ జో రూట్, కెప్టెన్ వోయిన్ మోర్గాన్ పోరాడినా…లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొనలేక పోయారు.

అఫ్ స్పిన్నర్ ధనుంజయ సైతం 3 కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు. 47 ఓవర్లలో ఇంగ్లండ్ 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.

50 వికెట్ల లాసిత్ మలింగ…

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాసిత్ మలింగ 31 పరుగులకే 4 వికెట్లు పడగొట్డడం ద్వారా ప్రపంచకప్ లో 50 వికెట్ల మైలురాయిని చేరగలిగాడు.

మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఇంగ్లండ్ కు ఇది రెండో ఓటమి కాగా శ్రీలంకకు రెండో గెలుపు మాత్రమే.

ప్రపంచ నంబర్ వన్ జట్టుగా..300కు పైగా స్కోర్లు అలవోకగా సాధించడంలో తనకుతానే సాటిగా నిలిచిన ఇంగ్లండ్ చివరకు 233 పరుగుల స్వల్ప టార్గెట్ ను సాధించలేక చతికిల పడటం విశేషం.

First Published:  22 Jun 2019 7:25 AM IST
Next Story