మహారాష్ట్ర, తెలంగాణలో భూకంపం..!
భూమి కంపించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో భూమి కంపించింది. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, బోథ్ మండలాలలో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాలలో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీసారు. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనలు 3.9 గా నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లా నిర్మల్, భైంసా, కుంభీర్ మండలాలలోని దేవులనాయక్ తండా, పుణ్యనాయక్ తండా, ఘనాపూర్, సాయినగర్ లలో భూమి కంపించింది. ఈ ప్రాంతాలలో రెండు సెకన్ల పాటు […]
భూమి కంపించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో భూమి కంపించింది. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, బోథ్ మండలాలలో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాలలో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీసారు.
రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనలు 3.9 గా నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లా నిర్మల్, భైంసా, కుంభీర్ మండలాలలోని దేవులనాయక్ తండా, పుణ్యనాయక్ తండా, ఘనాపూర్, సాయినగర్ లలో భూమి కంపించింది. ఈ ప్రాంతాలలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్దానికులు పేర్కున్నారు.
భూకంపం వల్ల కొన్ని చోట్ల ఇళ్లు పగుళ్లు తీసాయి. ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురయ్యాయి. భూమి కంపించడంతో తాము భయభ్రాంతులకు గురయ్యామని, ఏం జరుగుతోందో తెలియలేదని భూకంపిత గ్రామాల ప్రజలు చెప్పారు.
“నేను భోజనం చేస్తుండగా అన్నం ప్లేటు దానంతట అదే కదిలింది. దాంతో ప్లేటు వదిలేసి బయటకు పరుగులు తీసాను ” అని దేవులనాయక్ తండాకు చెందిన రాగ్యా నాయక్ చెప్పారు.
మహారాష్ట్రాలోని ఖతార్, నాందేడ్ లతో సహా కొన్ని ప్రాంతాలలో గురువారం నాడు కూడా భూమి కంపించింది. మళ్లీ ఆ మర్నాడు శుక్రవారం నాడు కూడా కంపించడంతో స్దానికులు ఆందోళన చెందుతున్నారు. గురువారం నాడు ఖతార్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదయ్యింది.
ఇంతకు ముందు ఇదే ప్రాంతంలో పలు మార్లు భూమి కంపించడంతో స్దానికులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తండా వాసులను ఈ భూకంపం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకూ ఎండలు మండిపోవడంతో అల్లాడిపోయిన తండా వాసులు ఇప్పుడు ఈ భూకంపంతో మరింత ఆందోళన చెందుతున్నారు.