Telugu Global
NEWS

కట్టింది మా బాబు.... ఏముఖం పెట్టుకుని సచివాలయం వాడుకుంటారు?

ప్రజావేదిక భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రౌడీయిజం చేస్తోందని అశోక్‌ బాబు ఆరోపించారు. ప్రజావేదిక భవన్ తమకే కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాత దానికి సమాధానం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను మీ పార్టీకి కేటాయించకముందే మీరు ఎలా వాడుకుంటున్నారని ప్రశ్నించగా… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివాసానికి అనుబంధంగా ప్రజావేదిక ఉంటుందని ప్రభుత్వం […]

కట్టింది మా బాబు.... ఏముఖం పెట్టుకుని సచివాలయం వాడుకుంటారు?
X

ప్రజావేదిక భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రౌడీయిజం చేస్తోందని అశోక్‌ బాబు ఆరోపించారు. ప్రజావేదిక భవన్ తమకే కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాత దానికి సమాధానం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

అసలు ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను మీ పార్టీకి కేటాయించకముందే మీరు ఎలా వాడుకుంటున్నారని ప్రశ్నించగా… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివాసానికి అనుబంధంగా ప్రజావేదిక ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అశోక్ బాబు చెప్పుకొచ్చారు.

పంచమర్తి అనురాధ మరో అడుగు ముందుకేసి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా ప్రభుత్వంలో భాగమేనని… అలాంటి వ్యక్తి పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు చూడాలని జగన్‌కు కోరికగా ఉంటే వస్తే చంద్రబాబు నివాసంలోనే కాఫీ ఇచ్చి భోజనం కూడా పెడుతామన్నారు.

అసలు చంద్రబాబు ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ఆరోపణలు చేసిన వారు… ఏ ముఖం పెట్టుకుని ప్రజావేదికను వాడుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు కట్టిన సచివాలయంలో మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

ప్రజావేదికను, సచివాలయాన్ని వాడుకోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అనురాధా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వ్యవహారం చాలా చౌకబారుగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

వీళ్ళ విమర్శల పై విజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు పాలనలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య తేడా లేకుండా చేసేశారు. పార్టీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల మధ్య తేడా లేకుండా వాడేశారు. ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ ను, ఆ వ్యవస్థను పార్టీకోసం వాడేశారు. ఎంతగా వాడేశారూ అంటే అది పార్టీదో, ప్రభుత్వానిదో తెలుగుదేశం నాయకులు కూడా గుర్తించలేనంతగా…!

ఇప్పుడు ప్రజావేదికను కూడా పార్టీ ఆస్తిగానే అశోక్ బాబు, అనురాధలు భావిస్తున్నారు. ప్రభుత్వం డబ్బుతో కట్టిన ప్రజావేదికను గతంలో చంద్రబాబు ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు, ఎక్కువగా పార్టీ కార్యక్రమాలకు వాడేశారు. చంద్రబాబు ఓడిపోయాక ప్రభుత్వానికి చెందిన ఆ ప్రజావేదికలో ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడతామంటే రాజేంద్రప్రదసాద్ దగ్గరి నుంచి అశోక్ బాబు, అనురాధలు కూడా అదేదో చంద్రబాబు ఆస్తిని ప్రభుత్వం వాడుకుంటున్నట్లుగా వీరంగాలు వేయడం ప్రజాస్వామ్య వాదులను ఆశ్చర్యపరుస్తోంది.

అనురాధ మరో అడుగు ముందుకేసి సచివాలయాన్ని జగన్ వాడుకోవడం కూడా తప్పేనన్నట్లుగా మాట్లాడుతోంది. చంద్రబాబు కట్టిన సచివాలయంలో జగన్ ఎలా కూర్చుంటాడని ప్రశ్నిస్తోంది. ఇలా ప్రశ్నించే వాళ్ళకు సమాధానం చెప్పగలిగింది ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లేనని విజ్ఞులు అంటున్నారు.

First Published:  22 Jun 2019 6:10 PM IST
Next Story