పెరోల్ ఇవ్వండి... సేద్యం చేస్తా " డేరా బాబా
తనని తాను గాడ్ మ్యాన్‌గా చెప్పుకుని తిరిగిన గుర్వీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో డేరా బాబాకు పంచకుల కోర్టు జీవిత ఖైదు విధించింది. 23నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా డేరా బాబాకు వ్యవసాయం మీదకు మనసు మళ్లింది. తనకు పెరోల్ ఇప్పించాలంటూ హర్యానా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. తాను చేసిందేమీ పెద్ద నేరాలు కాదని… పైగా […]
తనని తాను గాడ్ మ్యాన్‌గా చెప్పుకుని తిరిగిన గుర్వీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో డేరా బాబాకు పంచకుల కోర్టు జీవిత ఖైదు విధించింది.
23నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా డేరా బాబాకు వ్యవసాయం మీదకు మనసు మళ్లింది. తనకు పెరోల్ ఇప్పించాలంటూ హర్యానా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. తాను చేసిందేమీ పెద్ద నేరాలు కాదని… పైగా జైలులో తన ప్రవర్తన చాలా బాగుందని.. కాబట్టి పెరోల్ ఇవ్వాలని కోరారు.
పెరోల్ ఇస్తే తన ఆశ్రమ భూమిలో సేద్యం చేసి పంటలు పండిస్తానని విన్నవించుకున్నాడు. డేరా బాబా పిటిషన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.