Telugu Global
NEWS

జగన్‌ను అవహేళన చేసేలా ప్రభుత్వ మేగజైన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పేరుతో మేగజైన్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అవహేళన చేసేలా ఉంది. కనీసం జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా ఈ మేగజైన్‌ బృందం ఇష్టపడినట్టు కనిపించలేదు. ముఖ్యమంత్రిని అవహేళన చేసేలా ఉండడంతో పాటు తప్పుడు వ్యాఖ్యలతో మేగజైన్‌ను ముద్రించారు. దీంతో జూన్ ఎడిషన్‌ను బయటకు రాకుండా నిలిపివేశారు. చంద్రబాబు హయాంలో నియమితులైన వారే ఇప్పటికీ మేగజైన్ బాధ్యతలు […]

జగన్‌ను అవహేళన చేసేలా ప్రభుత్వ మేగజైన్‌
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పేరుతో మేగజైన్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అవహేళన చేసేలా ఉంది. కనీసం జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా ఈ మేగజైన్‌ బృందం ఇష్టపడినట్టు కనిపించలేదు.

ముఖ్యమంత్రిని అవహేళన చేసేలా ఉండడంతో పాటు తప్పుడు వ్యాఖ్యలతో మేగజైన్‌ను ముద్రించారు. దీంతో జూన్ ఎడిషన్‌ను బయటకు రాకుండా నిలిపివేశారు. చంద్రబాబు హయాంలో నియమితులైన వారే ఇప్పటికీ మేగజైన్ బాధ్యతలు చూస్తున్నారు. బహుశా తమ బాబు ఓడిపోయి జగన్‌ సీఎం అవడాన్ని చూసి తట్టుకోలేకపోయారేమో గానీ ఆ ఆక్రోశాన్ని మేగజైన్‌లో చూపించారు.

సాధారణంగా కలర్ కాపీగా ఈ మేగజైన్ ముద్రిస్తున్నారు. కానీ జగన్ సీఎం అయిన వెంటనే వెలువడిన తొలి ఎడిషన్‌ను బ్లాక్‌ అండ్ వైట్‌లో ముద్రించారు. జగన్‌ ప్రమాణస్వీకార ఫొటోను నలుపు రంగులో అచ్చేశారు. జగన్‌ అనే నేను అని సీఎం ప్రమాణస్వీకారం చేస్తే మేగజైన్‌లో హెడ్‌లైన్‌ను ‘జగన్‌ అనే అతడు’ అని పెట్టడం ద్వారా ఎడిటోరియల్ టీం తమలోని అసహనాన్ని ప్రదర్శించినట్టుగా ఉందని సీఎంవో అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాణస్వీకారం సందర్భంగా భావోద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ జగన్‌ను హత్తుకుని కంటతడిపెట్టారు. ఆ ఫోటోను ముద్రించిన మేగజైన్ వారు… జగన్‌ ఏడ్చినట్టు రాశారు. ఈ మేగజైన్‌ను చూసి జగన్‌ కూడా షాక్‌కు గురైనట్టు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై ఇలా తప్పుగా రాతలు రాయడంపై సీఎంవో తీవ్ర ఆగ్రహం, తన అసంతృప్తిని తెలియజేసింది. చేవలేని ఎడిటోరియల్ టీం నిర్వాకం వల్ల 38 లక్షలు వృథా అయినట్టు చెబుతున్నారు. చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఎందుకూ పనికి రాని విధంగా మేగజైన్‌ ఉందని సీఎంవో అధికారులు మండిపడుతున్నారు.

మేగజైన్ ఎడిటర్‌ ఉద్దేశపూర్వకంగానే ఇలా ఎడిషన్‌ను బ్లాక్ అండ్ వైట్‌లో అచ్చేయడంతో పాటు… కార్యక్రమానికి సంబంధించి తప్పుడు వ్యాఖ్యలతో ముద్రించారని సీఎంవో అధికారులు చెబుతున్నారు. ఎడిటర్‌ కందుల రమేష్ మాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నాడు.

First Published:  22 Jun 2019 5:58 AM IST
Next Story