Telugu Global
NEWS

ప్రపంచకప్ లో డబుల్ సెంచరీల వీరులు

రోహిత్, రూట్ ,వార్నర్, షకీబుల్ జోరు మొదటి 25 మ్యాచ్ ల్లోనే 14 సెంచరీలతో రికార్డు ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో సెంచరీల వెల్లువ కొనసాగుతోంది. మొదటి 25 లీగ్ మ్యాచ్ ల్లో వర్షం దెబ్బతో నాలుగురౌండ్ల మ్యాచ్ లు రద్దుల పద్దులో చేరినా ..మిగిలిన 21 మ్యాచ్ ల్లోనే డజను సెంచరీలు నమోదు కావడం విశేషం. ప్రతి రెండు మ్యాచ్ లకూ ఒక్కో సెంచరీ చొప్పున వివిధ దేశాల ఆటగాళ్లు సాధించారు. రెండు సెంచరీల మొనగాళ్లు.. […]

ప్రపంచకప్ లో డబుల్ సెంచరీల వీరులు
X
  • రోహిత్, రూట్ ,వార్నర్, షకీబుల్ జోరు
  • మొదటి 25 మ్యాచ్ ల్లోనే 14 సెంచరీలతో రికార్డు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో సెంచరీల వెల్లువ కొనసాగుతోంది. మొదటి 25 లీగ్ మ్యాచ్ ల్లో వర్షం దెబ్బతో నాలుగురౌండ్ల మ్యాచ్ లు రద్దుల పద్దులో చేరినా ..మిగిలిన 21 మ్యాచ్ ల్లోనే డజను సెంచరీలు నమోదు కావడం విశేషం. ప్రతి రెండు మ్యాచ్ లకూ ఒక్కో సెంచరీ చొప్పున వివిధ దేశాల ఆటగాళ్లు సాధించారు.

రెండు సెంచరీల మొనగాళ్లు..

ప్రపంచకప్ మొదటి 25 మ్యాచ్ ల్లో…రెండు సెంచరీల చొప్పున సాధించిన క్రికెటర్లు నలుగురు ఉన్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, భారత్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా వీరబాదుడు ఓపెనర్ డేవిడ్ వార్నర్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్.. రెండేసి సెంచరీలు చొప్పున బాదారు.

ఒక్కో సెంచరీ చొప్పున సాధించిన ఆటగాళ్లలో శిఖర్ ధావన్, జేసన్ రాయ్, ఆరోన్ ఫించ్, కేన్ విలయమ్స్ సన్, ముష్ ఫికుర్ రహీం, వోయిన్ మోర్గాన్ ఉన్నారు.

అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడి ఘనతను మాత్రం డేవిడ్ వార్నర్ సొంతం చేసుకొన్నాడు.

ఆతిథ్య ఇంగ్లండ్ తరపున కెప్టెన్ మోర్గాన్ తో సహా మొత్తం ముగ్గురు ఆటగాళ్లు నాలుగు సెంచరీలు బాదితే… భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు తలో మూడు శతకాలు, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ఒక సెంచరీ సాధించారు.

మొత్తం మీద..ఇంగ్లండ్ గడ్డపైన జరుగుతున్న ప్రస్తుత ఈ ప్రపంచకప్ లో వివిధ జట్లకు చెందిన టాపార్డర్ బ్యాట్స్ మన్ మాత్రం పరుగుల పండుగ చేసుకొంటున్నారు.

First Published:  21 Jun 2019 9:30 AM IST
Next Story