Telugu Global
NEWS

టీడీపీకి ఉన్న చెడ్డ లక్షణం అదే " అవంతి

పార్టీకి మూలస్తంభాల్లాంటి నేతలు బయటకు వెళ్లిపోతే దానిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఎదురుదాడి చేయడం టీడీపీకి సరికాదన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఎంపీలను చంద్రబాబే పంపించి ఉంటారని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆర్థికంగా చంద్రబాబుకు మూలస్తంభాలైన వారు ఇలా వెళ్లారంటే తప్పకుండా చంద్రబాబు ప్లానే ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్‌ను నేరుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న చంద్రబాబు… వీరిని బీజేపీలోకి పంపించి తన అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు వ్యూహ రచన చేశారన్నారు. నిజానికి బీజేపీతో […]

టీడీపీకి ఉన్న చెడ్డ లక్షణం అదే  అవంతి
X

పార్టీకి మూలస్తంభాల్లాంటి నేతలు బయటకు వెళ్లిపోతే దానిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఎదురుదాడి చేయడం టీడీపీకి సరికాదన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఎంపీలను చంద్రబాబే పంపించి ఉంటారని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆర్థికంగా చంద్రబాబుకు మూలస్తంభాలైన వారు ఇలా వెళ్లారంటే తప్పకుండా చంద్రబాబు ప్లానే ఉంటుందని వ్యాఖ్యానించారు.

జగన్‌ను నేరుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న చంద్రబాబు… వీరిని బీజేపీలోకి పంపించి తన అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు వ్యూహ రచన చేశారన్నారు.

నిజానికి బీజేపీతో నేరుగా స్నేహం కోసం చంద్రబాబు ప్రయత్నించారని… కానీ అందుకు అమిత్ షా అంగీకరించలేదన్నారు. వైసీపీలో చేరాలంటే రాజీనామా చేసిన తర్వాతే రావాల్సి ఉంటుందని జగన్‌ చెప్పడంతోనే… వీరంతా బీజేపీ వైపు వెళ్తున్నారన్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజ్యసభ ఎంపీలు అయ్యారని… ఇప్పుడు టీడీపీకి భవిష్యత్తు లేదని వారు బీజేపీలోకి వెళ్లిపోయారన్నారు.

జగన్‌ సరే అంటే రావడానికి చాలా మంది ఉన్నారని… కానీ ఆయన అంగీకరించకపోవడంతో టీడీపీకి చెందిన మరింత మంది బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

పదేళ్ల పాటు టీడీపీని తన డబ్బుతో పోషించిన వ్యక్తి సుజనాచౌదరి అని వ్యాఖ్యానించారు. అలాంటి సుజనాచౌదరి వెళ్లిపోతే తమకేంటి అని టీడీపీ నేతలు అనడం పొరపాటు అన్నారు. సుజనాచౌదరి వంటి వారి వల్ల పార్టీకి చాలా ఉపయోగం జరిగిందన్నారు. కానీ టీడీపీలో ఉన్న చెడు లక్షణం… వాడుకోవడం…వారు బయటకు వెళ్లిపోతే మాత్రం తక్కువ చేసి మాట్లాడడం అలవాటు అని విమర్శించారు.

రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావు… టీడీపీ తన సొంత పార్టీ అనుకుని పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు బయటకు వెళ్లిపోతే ఆయన్ను కూడా టీడీపీ నేతలు తిట్టడం సరికాదన్నారు. వారు ఎందుకు వెళ్లిపోయారు? అన్నది టీడీపీ నేతలు ఆలోచన చేసుకుంటే మంచిదన్నారు. వీరు బీజేపీలో చేరడం వెనుక చంద్రబాబు వ్యూహం కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు అవంతి.

First Published:  21 Jun 2019 2:57 AM IST
Next Story