ఏబీఎన్ రాధాకృష్ణపై టీడీపీ నేతల ఫైర్
టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకవైపు రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలోకి వెళ్లిపోగా… అదే సమయంలో కాపు టీడీపీ నేతలు కాకినాడలో రహస్యంగా భేటీ అయ్యారు. కాపు టీడీపీ నేతల భేటీలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏబీఎన్ రాధాకృష్ణ పైనా, నారా లోకేష్ పైనా సమావేశంలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాధాకృష్ణ చెప్పిన వారికే చంద్రబాబు సీట్లు, కోట్లు ఇచ్చారని పలువురు కాపు నేతలు ఆవేదన చెందారు. రాధాకృష్ణతో పాటు లోకేష్ […]
టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకవైపు రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలోకి వెళ్లిపోగా… అదే సమయంలో కాపు టీడీపీ నేతలు కాకినాడలో రహస్యంగా భేటీ అయ్యారు. కాపు టీడీపీ నేతల భేటీలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ఏబీఎన్ రాధాకృష్ణ పైనా, నారా లోకేష్ పైనా సమావేశంలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాధాకృష్ణ చెప్పిన వారికే చంద్రబాబు సీట్లు, కోట్లు ఇచ్చారని పలువురు కాపు నేతలు ఆవేదన చెందారు.
రాధాకృష్ణతో పాటు లోకేష్ కూడా పార్టీకి తీవ్ర నష్టం చేశారని… లోకేష్ కేవలం తన సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేసి పార్టీపై కుల ముద్ర పడేలా చేశారని నేతలు మండిపడ్డారు.
గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు, నారా లోకేష్ కాపు నేతలను అవమానకరంగా, అనుమానంగా చూసేవారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో డబ్బులు కూడా కేవలం తన సొంత వర్గానికి మాత్రమే ఎక్కువగా ఇచ్చి, ఇతర వర్గాల వారిని మాత్రం గాలికొదిలేశారని కాపు నేతలు ఆరోపించారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇచ్చారని పోల్చి చూసుకున్నారు. ఇకపై చంద్రబాబు కాపు నేతలతో ఏమైనా మాట్లాడాలని పిలిస్తే సమిష్టిగా అందరూ కలిసి వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు.