ఆ 15 మంది కూడా జంప్ ?
టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు వెళ్లిపోయారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ నలుగురూ పారిశ్రామిక వేత్తలే. టీడీపీకి ఆర్ధికంగా చేయూత ఇచ్చినవారే. వీరు పార్టీ మారడంలో పెద్ద వింతేమి లేదనేది తమ్ముళ్లమాట. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి సీఎం రమేష్, సుజనా చౌదరి ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. తమ మీదకు కేసులు రాకుండా చూసుకున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా మంచి లబ్ధిపొందారు. ఇప్పుడు […]
టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు వెళ్లిపోయారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ నలుగురూ పారిశ్రామిక వేత్తలే. టీడీపీకి ఆర్ధికంగా చేయూత ఇచ్చినవారే. వీరు పార్టీ మారడంలో పెద్ద వింతేమి లేదనేది తమ్ముళ్లమాట.
బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి సీఎం రమేష్, సుజనా చౌదరి ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. తమ మీదకు కేసులు రాకుండా చూసుకున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా మంచి లబ్ధిపొందారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో తమకు చాన్స్ లేదు. అందుకే ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ వంచన చేరారు. రాజ్యసభలో బలం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ వీరిని చవగ్గా కొట్టేసింది.
ఈ నలుగురు నేతలు టీడీపీలో కీలకంగా ఉన్నారు. వీరు మొన్న ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఇప్పించారు. కొందరికి ఆర్ధికంగా సర్దుబాటు చేశారు. మరికొందరు నేతలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ఈనేతలతో పాటు బీజేపీలోకి ఎవరెవరు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.
అమరావతిలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళతారని తెలుస్తోంది.
బీజేపీ నేతలు ఇటీవల ఓ ప్రకటన చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో కూడా తమ వాణి వినిపిస్తామన్న మాట చెబుతున్నారు. అంటే టీడీపీ నుంచి 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు వేరు పడి…తమని బీజేపీ వర్గంగా గుర్తించాలని స్పీకర్‌ను కోరబోతున్నారట. ఇలా 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు వేరు పడేందుకు స్కెచ్ గీశారని తెలుస్తోంది.
ఈ వర్గానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వం వహిస్తారని ఓ టాక్ విన్పిస్తోంది. మొత్తానికి టీడీపీకి మాత్రం ఆగస్ట్ సంక్షోభం పొంచి ఉంది. వచ్చే నెలరోజుల పాటు టీడీపీ నుంచి వలసలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం కన్పిస్తోంది.