Telugu Global
NEWS

కాళేశ్వరం ప్రారంభోత్సవం.... హరీష్ ఎమోషనల్ ట్వీట్

తెలంగాణ కరువు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హోమాలు నిర్వహిస్తూ ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ప్రారంభించారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గడిచిన ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పరుగులు పెట్టించిన హరీష్ రావు ఇప్పుడు ఎమ్మెల్యేనే కావడంతో ఆయనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే ఈ ఓపెనింగ్ వేళ హరీష్ ట్విట్టర్ లో ఎమోషన్ ట్వీట్ పెట్టారు. […]

కాళేశ్వరం ప్రారంభోత్సవం.... హరీష్ ఎమోషనల్ ట్వీట్
X

తెలంగాణ కరువు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హోమాలు నిర్వహిస్తూ ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ప్రారంభించారు.

అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గడిచిన ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పరుగులు పెట్టించిన హరీష్ రావు ఇప్పుడు ఎమ్మెల్యేనే కావడంతో ఆయనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే ఈ ఓపెనింగ్ వేళ హరీష్ ట్విట్టర్ లో ఎమోషన్ ట్వీట్ పెట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్టుదల వల్లే కాళేశ్వరం పూర్తయ్యిందని.. ఆయన అపర భగీరథుడు అంటూ హరీష్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. నాటి సమైక్య పాలకులు నీటి లభ్యత లేని చోట ప్రాజెక్ట్ కడితే.. కేసీఆర్ ఇంజనీర్ లా మారి ప్రాజెక్ట్ రిడిజైన్ చేసి పొరుగు రాష్ట్రాలతో విభేదాలు పరిష్కరించి మరీ ఈ కాళేశ్వరం నిర్మించాడని కొనియాడారు.

ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికి శ్రమించిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పిన హరీష్ రావు.. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని తిలకిస్తున్న తెలంగాన రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణలో కీలకంగా ఉన్న హరీష్ రావు ఇప్పుడు తనకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఎమోషనల్ గా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

First Published:  21 Jun 2019 2:35 AM GMT
Next Story