Telugu Global
NEWS

నేడే కాళేశ్వరం ప్రారంభం

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, పచ్చని పొలాలతో కళకళలాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ నీటి పారుదల ప్రాజెక్టు శుక్రవారం నాడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ వర్ధంతి అయిన జూన్ 21 వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే శుక్రవారం నాడు ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు […]

నేడే కాళేశ్వరం ప్రారంభం
X

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, పచ్చని పొలాలతో కళకళలాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ నీటి పారుదల ప్రాజెక్టు శుక్రవారం నాడు అట్టహాసంగా ప్రారంభం కానుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ వర్ధంతి అయిన జూన్ 21 వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే శుక్రవారం నాడు ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం అతిధుల రాక కోసం ఐదు హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసింది. వీటి కోసం కాళేశ్వరం సమీపంలో హెలీప్యాడ్ లను కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 10- 30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్న కన్నెపల్లి పంప్ హోస్ లో 50 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 4.47 టీఎంసీలకు నీరు చేరుకోగానే 21 మీటర్ల ఎత్తుకు ఆ నీటిని ఎత్తిపోసి అన్నారం బ్యారేజికి తరలిస్తారు. ఇక్కడ నిలువ వేసిన నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 9 మెటార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నీటి నిలువ 4.25 టీఎంసీలకు చేరుకోగానే 11 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి సుందిళ్ల బ్యారేజీకి తరలిస్తారు.

ఇక్కడి పంప్ హోస్ వద్ద 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 9మెటార్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నీటిని 16 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి ఎల్లంపల్లికి తరలిస్తారు.

ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బతుకులను మారుస్తుందని, ఇక ముందు ముందు పొలాలన్నీ పచ్చగా కళకళలాడతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.

First Published:  21 Jun 2019 1:39 AM IST
Next Story