జగన్ సంచలనం.... పాలనపై పట్టు....
ఏపీ సీఎంగా గద్దెనెక్కగానే జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులెత్తిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో పారదర్శకతకు పట్టం కడుతున్నారు. అవినీతి రహిత, ప్రజలకు చేరువయ్యే పాలనను అందించడానికి నడుం బిగించారు. తాజాగా జిల్లాలకు పాలనను చేరువ చేయాలని.. ఆయా జిల్లాల సమస్యలను తీర్చేందుకు జగన్ పూనుకున్నారు. ఇందుకోసం ప్రతి మంత్రిని ఒక జిల్లాకు ఇన్ చార్జిగా నియమించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మంత్రులను…. ఏపీలోని 13 […]
ఏపీ సీఎంగా గద్దెనెక్కగానే జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులెత్తిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో పారదర్శకతకు పట్టం కడుతున్నారు. అవినీతి రహిత, ప్రజలకు చేరువయ్యే పాలనను అందించడానికి నడుం బిగించారు.
తాజాగా జిల్లాలకు పాలనను చేరువ చేయాలని.. ఆయా జిల్లాల సమస్యలను తీర్చేందుకు జగన్ పూనుకున్నారు. ఇందుకోసం ప్రతి మంత్రిని ఒక జిల్లాకు ఇన్ చార్జిగా నియమించారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం మంత్రులను…. ఏపీలోని 13 జిల్లాలకు ఇన్ చార్జ్ లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాలనను ప్రజలకు చేరువ చేయాలని.. సమస్యలపై ప్రతీ వారం రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
* జిల్లాలకు ఇన్ చార్జీ మంత్రులు వీరే….
- గుంటూరు -పేర్ని నాని
- కృష్ణ-కన్నబాబు
- ప్రకాశం -అనిల్ కుమార్ యాదవ్
- నెల్లూరు-సుచరిత
- కర్నూలు-బొత్స సత్యనారాయణ
- కడప-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- చిత్తూరు -మేకపాటి గౌతమ్ రెడ్డి
- అనంతపురం -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- పశ్చిమ గోదావరి -పిల్లి సుభాష్ చంద్రబోస్
- తూర్పు గోదావరి – ఆళ్ల నాని
- విశాఖపట్నం – మోపిదేవి వెంకటరమణ
- విజయనగరం – శ్రీరంగ నాథరాజు
- శ్రీకాకుళం -వెల్లంపల్లి శ్రీనివాస్