Telugu Global
Health & Life Style

నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రపంచ దేశాలు నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆరోగ్యానికి యోగాసనాలు ఎంతో మేలు చేస్తాయని ప్రపంచానికి తెలియజేసిన భారతదేశంలో కూడా యోగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసాయి. రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో జరిగే యోగా వేడుకలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ ఏడాది జరుగుతున్న యోగా అంతర్జాతీయ దినోత్సవం ఐదవది కావడం విశేషం. ఈ మైదానంలో దాదాపు 40 వేల మంది […]

నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం
X

ప్రపంచ దేశాలు నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆరోగ్యానికి యోగాసనాలు ఎంతో మేలు చేస్తాయని ప్రపంచానికి తెలియజేసిన భారతదేశంలో కూడా యోగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసాయి.

రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో జరిగే యోగా వేడుకలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ ఏడాది జరుగుతున్న యోగా అంతర్జాతీయ దినోత్సవం ఐదవది కావడం విశేషం. ఈ మైదానంలో దాదాపు 40 వేల మంది యోగాసనాలతో అంగరంగ వైభవంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో యోగా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలతో పాటు ఐటి కంపెనీలలో కూడా యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసారు.

తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలోను జరిగే యోగా దినోత్సవ వేడుకలలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, శాసన సభ్యులు, లోక్ సభ సభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గోనున్నారు.

యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో శాంతి, సహనం కలుగుతాయని, యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

యోగాను భారతదేశంతో పాటు ప్రపంచలోని అన్ని దేశాలు ఆచరిస్తున్నాయని, యోగా వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక శాంతి కూడా లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

First Published:  21 Jun 2019 2:30 AM IST
Next Story