Telugu Global
NEWS

భారత్ తో అప్ఘనిస్థాన్ సమరం

 సెమీస్ కు గురిపెట్టిన విరాట్ సేన ప్రపంచకప్ లో వరుసగా నాలుగో విజయానికి రెండోర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. పసికూన అప్ఘనిస్థాన్ తో మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐదో రౌండ్ పోటీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో సౌతాఫ్రికా, మూడోరౌండ్లో ఆస్ట్రేలియా, నాలుగో రౌండ్లో పాకిస్థాన్ లను చిత్తు చేసిన భారత్…న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఐదురౌండ్లలో 7 పాయింట్లు సాధించిన భారత్…మిగిలిన నాలుగు రౌండ్లలో మూడు మ్యాచ్ లు […]

  • సెమీస్ కు గురిపెట్టిన విరాట్ సేన

ప్రపంచకప్ లో వరుసగా నాలుగో విజయానికి రెండోర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. పసికూన అప్ఘనిస్థాన్ తో మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐదో రౌండ్ పోటీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

తొలిరౌండ్లో సౌతాఫ్రికా, మూడోరౌండ్లో ఆస్ట్రేలియా, నాలుగో రౌండ్లో పాకిస్థాన్ లను చిత్తు చేసిన భారత్…న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.

ఐదురౌండ్లలో 7 పాయింట్లు సాధించిన భారత్…మిగిలిన నాలుగు రౌండ్లలో మూడు మ్యాచ్ లు నెగ్గినా సెమీస్ చేరగలుగుతుంది.

మరోవైపు ..అంతంత మాత్రం అనుభవం ఉన్న అప్ఘనిస్థాన్ మాత్రం వరుస పరాజయాలతో ఇప్పటికే సెమీస్ రేస్ కు దూరమయ్యింది. బ్యాటింగ్ లో,బౌలింగ్ లో నిలకడలేమితో కొట్టిమిట్టాడుతున్న అప్ఘన్ జట్టు పవర్ ఫుల్ భారత్ కు ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

టాప్ గేర్ లో భారత్ …

ప్రపంచకప్ లో భాగంగా భారత్ ఇప్పటి వరకూ ఆడిన నాలుగుమ్యాచ్ ల్లో మూడు శతకాలు సాధించింది. సౌతాఫ్రికా, పాక్ జట్లపై రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాపై శిఖర్ ధావన్ శతకాలు బాది భారత విజయాలలో ప్రధానపాత్ర వహించారు.బొటనవేలి గాయంతో శిఖర్ ధావన్ జట్టుకు దూరం కావడంతో…ధావన్ స్థానంలో యువఆటగాడు రిషభ్ పంత్ కు చోటు కల్పించారు.

పంత్ వైపే అందరి చూపు..

అప్ఱనిస్థాన్ తో జరుగనున్న మ్యాచ్ ద్వారా..యంగ్ గన్ రిషభ్ పంత్.. సీనియర్ ప్రపంచకప్ అరంగేట్రం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో భారత్ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లలో ఒకరిద్దిరికి అవకాశాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

అఫ్ఘన్ తో మ్యాచ్ లో భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగితే 350 కి పైగా స్కోరు సాధించే అవకాశం ఉంది.

అయోమయంలో అప్ఘన్ బౌలర్లు..

ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకొన్న అప్ఘన్ బౌలర్లు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ కొట్టిన దెబ్బతో అప్ఘన్ బౌలింగ్ లైనప్ కకా వికలైపోయింది.

భారత్ తో జరిగే పోటీలో ఏ మాత్రం ఆత్మస్థైర్యంతో అప్ఘన్ బౌలర్లు బరిలోకి దిగగలరన్నది అనుమానమే.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటికే రెండు శతకాలు బాదిన రోహిత్ శర్మ.. పసికూన అఫ్ఘన్ జట్టు పైన సైతం సెంచరీ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

వర్షంతో ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ సజావుగా సాగితే..భారత్ భారీవిజయం సాధించడం కేవలం లాంఛనం మాత్రమే.

First Published:  21 Jun 2019 6:38 AM IST
Next Story